అది చెబితే సార్ తిడతారు.. మా ఆయన ఆ విషయం పట్టించుకోరు.. చిలిపిగా అనసూయ రియాక్షన్
అనసూయ భరద్వాజ్ అంటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. నటి అవుదామని వచ్చి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలితో జబర్దస్త్ కామెడీ షోలో హాట్ యాంకర్ గా నిలిచింది. తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. విభిన్న పాత్రలతో సినిమాల్లోనూ తన సత్తా చూటుకుంటుంది. గ్లామర్ షో, తన డ్రెస్సింగు గురించి కామెంట్స్ చేసిన నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటదీ తెలుగు గుమ్మ. ఓ సినిమా ఫంక్షన్ లో పుష్ప-2 గురించి అడిగిన ప్రశ్నకు కొంటెగా సమాధానమిచ్చింది. ఆ ప్రశ్న ఏంటీ, ఇచ్చిన జవాబేంటో తెలుసుకుందాం.
సినిమాల్లో యాక్టింగ్ చేస్తూనే ఆడియో ఫంక్షన్లలో, టీవీ షోలలో యాంకర్ గా, ఓపెనింగ్స్ గెస్ట్ గా వెళుతూ తన కెరీర్ ను ప్లాన్డ్ గా డిజైన్ చేసుకుంటోంది అనసూయ భరద్వాజ్. రంగస్థలంలో రంగమ్మ అత్త, పుష్పలో దాక్షాయణి, విమానం సినిమాలో వేశ్య పాత్రలతో సిని అభిమానుల ఆధరణ పొందింది.

జబర్దస్త్ కామెడీ షోలో తన అందచందాలతో ఆకర్షణ నిలిచింది. అప్పుడప్పుడు స్కిట్ లలో కూడా తన యాక్టింగ్ తో మెప్పించింది. కానీ తన అందం గురించి, వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు. అంతే ఘాటుగా రిప్లై ఇస్తుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొంటూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
పుష్ప ఫస్ట్ పార్ట్ లో దాక్షయణిగా మంచి ప్రాధాన్యత గల పాత్రలో నటించి మెప్పించిన అనసూయ పుష్ప-2లో కూడా నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్, ఆమె క్యారెక్టర్ గురించి అడగ్గా చెప్పేందుకు ఇష్టపడలేదు. "చెప్పొచ్చని చెప్పారా మీకెవరైనా.. నాకు భయం నేను చెప్పను.. చివాట్లు పడతయ్ మా సారు నుంచి" అంట సున్నితంగా తిరస్కరించి తెలివిగా తప్పించుకుంది అనసూయ భరధ్వాజ్.

సంపత్ నంది దర్శకత్వంలో జగపతిబాబు, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్న సింబా చిత్రంలో అనసూయ భరధ్వాజ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల సింబా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనసూయ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని అడగ్గా.. వచ్చిన పాత్రలే మళ్లీ మళ్లీ రావడం వల్ల తిరస్కరిస్తున్నట్టు జవాబిచ్చారు.
ఒక తెలుగమ్మాయికి ఇన్ని భాషల్లో అవకాశాలు రావడం చాలా ఉంది. కాకపోతే గ్లామర్ ప్రొజెక్ట్ చేద్దామనుకుంటున్న. మెయింటైన్ చేయగలిగినంత వరకు షో ఆఫ్ చేస్తా. ఇందుకు సిగ్గుపడాల్సిందేముంది. ఇది నా బాడీ, ఇదే నేను. నాలాగా ఎవరూ లేరని నేను అనుకుంటానని చెప్పుకొచ్చింది. వృత్తి విషయంలో మీ భర్త సలహాలు ఇవ్వరా అంటే.. మా ఆయన అసలు జోక్యం చేసుకోరు.. ఆయన బంగారం.. ఏ విషయాలు పట్టించుకోరు అంటూ సమాధానమిచ్చింది.


Click it and Unblock the Notifications











