కుర్రాళ్ల గుండెలను బద్దలు కొట్టిన అనసూయ.. ఇక నుంచి తనను అలా పిలవాల్సి వస్తుందట
జబర్దస్త్ షోతో బుల్లితెరను ఓ ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్.. వెండితెరపైనా మ్యాజిక్ క్రియేట్ చేసింది. గ్లామర్ షోకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన నటనపై ఫోకస్ చేస్తూ వస్తోన్న అనసూయ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో అనసూయపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి మీకు మాత్రమే చెప్తా అంటూ అందర్నీ మెప్పించేందుకు సిద్దమైంది.

విజయ్ దేవరకొండ నిర్మాణంలో..
విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న మీకు మాత్రమే చెప్తా ఎంతటి సన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. స్వయంగా దగ్గరుండి మరీ మూవీ ప్రమోషన్లు చేస్తోన్న ఈ రౌడీ హీరో.. నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు సిద్దమయ్యాడు. తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన మీకు మాత్రమే చెప్తా చిత్రం నవంబర్ 1న విడుదల కానుండగా.. నిన్న (అక్టోబర్ 29) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

రంగమ్మత్తగా ఫేమస్..
రంగస్థలంలో రంగమ్మత్తగా జీవించిన అనసూయను.. ప్రేక్షకులందరూ అలాగే పిలవసాగారు. ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్తగానే చూడసాగారు. అయితే అంతలా గుర్తింపు తెచ్చిన ఆ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక నుంచి తనను రంగమ్మత్తగా చూడరని.. అందరూ అక్క అని పిలుస్తారని షాకింగ్ కామెంట్లు చేసింది.

అక్కా.. అని పిలవాల్సి వస్తుంది..
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అక్క పాత్రను పోషించాను. అందరూ ఆ పాత్రకు రిలేట్ అవుతారు.. ఇక నుంచి నన్ను అందరూ అక్కా అని పిలవాల్సి వస్తుంది.. అందుకు కొంతమంది ఫ్యాన్స్‌కు సారీ.. అంటూ చెప్పుకొచ్చింది.

మాట్లాడనివ్వకుండా అభిమానుల అరుపులు..
స్టేజ్‌పైకి ఎక్కిన అనసూయను అభిమానులు తమ అరుపులతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. స్పీచ్ ఇద్దామని మాట్లాడేలోపే అరుపులతో అక్కడి ప్రాంగణాన్ని హోరెత్తించారు. కావాలనే ర్యాగింగ్ చేస్తున్నారా? అంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











