థూ! అంటూ కామెంట్స్.... నేనేమైనా బికినీ వేశానా? అనసూయ ఫైర్!

By Bojja Kumar

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హోటల్ వివేరా వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న యాంకర్, నటి అనసూయ జెండా ఎగరవేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన జీవితంలో మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశానని, ఎంతో గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు. అయితే ఆమె ఇలా పోస్టు పెట్టిందో? లేదో? కొందరు ఆమెను తిడుతూ కామెంట్లతో రెచ్చిపోయారు. అందుకు కారణం ఈ కార్యక్రమానికి ఆమె సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా మోడ్రన్ దుస్తుల్లో హాజరు కావడమే. అయితే తనపై ఇలాంటి కామెంట్స్ చేసిన వారిపై అనసూయ విరుచుకుపడింది.

స్వాతంత్ర్యం అంటే ఇదేనా? మరీ ఇంత నీచమా?

స్వాతంత్ర్యం అంటే ఇదేనా? మరీ ఇంత నీచమా?

మీ దృష్టిలో ఇండిపెండెన్స్ అంటే ఏమిటి? మహిళల మీద మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడమే ఇండి‌పెండెన్సా? ఎందుకు ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నారు? మీరు మీ జీవితంలో ఎంత ప్రస్టేటెడ్ గా ఉన్నారో మీ కామెంట్లను చూస్తే అర్థం అవుతోంది.... అంటూ అనసూయ విరుచుకుపడ్డార.

Recommended Video

Anchor Anasuya Bharadwaj Strongly Responds To Fans Reply
మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది

మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది

మీరు చేసిన కామెంట్లను చాలా వరకు డిలీట్ చేశాను. ఎందుకంటే నా ఫ్యామిలీ, నేనంటే ఇష్టపడే వారు చూసి హర్ట్ అవుతారని ఈ పని చేశాను. మీ కామెంట్లకు డీలా పడిపోయే మనిషిని కాను. నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఇండిపెండెన్స్‌ను మీరు ఇలా థింక్ చేయడాన్ని చూస్తుంటే సిగ్గేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీకు గౌరవం ఇవ్వను

మీకు గౌరవం ఇవ్వను

మీరు నాకు గౌరవం ఇవ్వనపుడు మీకు కూడా నేను గౌరవం ఇవ్వదలుచుకోలేదు.... అంటూ కొందరు చేసిన కామెంట్లను అనసూయ స్వయంగా చదివి వినిపించారు.

చీరలో వెళ్లాలనే రూల్ ఏమైనా ఉందా?

చీరలో వెళ్లాలనే రూల్ ఏమైనా ఉందా?

నేను వేసుకున్న బట్టల్లో తప్పేముంది? ఇండిపెండెన్స్ డే వేడుకలకు సారీలో వెళ్లాలనే రూల్ ఏమైనా ఉందా? అసలు మీ సమస్య ఏమిటి? మీరు ఇలా చేయడం హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏ మాత్రం కాదు అని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేనేమైనా బికినీ వేశానా?

నేనేమైనా బికినీ వేశానా?

ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఆ డ్రెస్సేంటి మేడమ్? అనే కామెంటుకు అనసూయ రియాక్ట్ అవుతూ..... ఏం డ్రెస్ వేశానండీ? బికినీ వేసుకుని వెళ్లానా? అంటూ ఫైర్ అయ్యారు.

 ఇదిఏమైనా షాపింగ్ మాల్ ఓపెనింగా... థూ!

ఇదిఏమైనా షాపింగ్ మాల్ ఓపెనింగా... థూ!

‘ఇది ఏమైనా షాపింగ్ మాల్ ఓపెనింగా..థూ!' అంటూ మరొక వ్యక్తి చేసిన నీచమైన కామెంటను చదివి వినిపించిన అనసూయ... నాకు ఇష్టమైన డ్రెస్సు వేసుకునే హక్కు నాకు ఉంది. అనడానికి మీరెవరు? మీలాంటి వారిని చూస్తుంటే సిగ్గేస్తుంది అంటూ ఫైర్ అయ్యారు.

నీకు జెండా విలువ తెలుసా?

నీకు జెండా విలువ తెలుసా?

నీకు జెండా విలువ తెలుసా? అనే ఇంకో కామెంటను చదివి వినిపించిన అనసూయ.... మనిషిగా నీకు విలువ ఉందా? నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఉందా? అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఫ్రస్టేషన్లో బూతులు

ఫ్రస్టేషన్లో బూతులు

ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి నువ్వు రైట్ పర్సన్ అనుకుంటున్నావా? అంటూ మరొకరు చేసిన కామెంటుకు అనసూయ సహనం కోల్పయారు. ఫ*** అంటూ తిట్టేశారు. పొరపాటున తన నోటి నుండి వచ్చిన ఆ మాటకు సారీ చెబుతూనే.... అతడిపై విరుచుకుపడ్డారు. నేను జెండా ఎగరవేయడానికి కరెక్టా? కాదా? అని చెప్పడానికి నువ్వెవరు? నేను భారతీయురాలిని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అంటూ ఆవేశంగా మాట్లాడారు.

 మీ తల్లిదండ్రులు సిగ్గుపడేలా ప్రవర్తించవద్దు

మీ తల్లిదండ్రులు సిగ్గుపడేలా ప్రవర్తించవద్దు

మీకు జన్మనిచ్చినందుకు మీ తల్లిదండ్రులు తలదించుకోకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని టెక్ట్స్ చేయండి. అలాంటి కామెంట్స్ చేస్తున్న వారు నాకు అవసరం లేదు. వారిని బ్లాక్ చేస్తున్నాను అని అనసూయ పేర్కొన్నారు.

నన్ను ఇష్టపడే వారు పది మంది ఉన్నా చాలు

నన్ను ఇష్టపడే వారు పది మంది ఉన్నా చాలు

నేనంటే ఇష్టం లేకుంటే, నా పోస్టులు చూడటం నచ్చకపోతే నా పేజ్ నుండి వెళ్లి పొండి. అనసూయకు ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పుకునే రకం నేను కాదు. నన్ను ఇష్టపడేవారు పది మంది ఉన్నా చాలు. ఎంత మంది ఉన్నారో కాదు... ఎంలాంటి వారు ఉన్నారో అనేది ముఖ్యం అని అనసూయ తేల్చి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X