»   »  కఠినాత్మురాలు: యాంకర్ అనసూయపై సోషల్ దాడి... తట్టుకోలేక అదృశ్యం!

కఠినాత్మురాలు: యాంకర్ అనసూయపై సోషల్ దాడి... తట్టుకోలేక అదృశ్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో అదృశ్యం అయ్యారు. ఇందుకు కారణం ఇటీవల హైదరాబాద్‌ తార్నాకలో జరిగిన ఓ సంఘటనే కారణమని తెలుస్తోంది. ఆమెపై నెటిజన్లు ముప్పేట దాడి చేయడంతో తట్టుకోలేక తన సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

Anchor Anasuya in a Bizarre Controversy, Video
 సెల్ఫీ అడిగితే ఫోన్ బద్దలు కొట్టిన అనసూయ

సెల్ఫీ అడిగితే ఫోన్ బద్దలు కొట్టిన అనసూయ

యాంకర్ అనసూయ రెండు రోజుల క్రితం తన తల్లిని కలిసేందుకు తార్నాక ప్రాంతంలోని పుట్టింటికి వచ్చారు. ఆ సమయంలో తన తల్లితో కలిసి అటుగా వెళుతున్న పదేళ్ల బాలుడు అనసూయతో సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అనసూయ..... పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఫోన్ బద్దలు కొట్టింది.

 సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

తన పదేళ్ల కుమారుడు యాంకర్ అనసూయతో సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించగా తమను గలీజ్ మాటలు మాట్లుడుతూ తిట్టడంతో పాటు తమ ఫోన్ బద్దలు కొట్టిందంటూ..... తల్లికొడుకులు తమ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 కఠినాత్మురాలంటూ నెటిజన్ల దాడి

కఠినాత్మురాలంటూ నెటిజన్ల దాడి

పదేళ్ల బాలుడు సెల్ఫీ తీసుకోవడానికి పయత్నిస్తే ఇలా ప్రవర్తించడం చాలా దారుణం, నీవు కఠినాత్మురాలివి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఆమెపై మాటల దాడి ప్రారంభించారు. లక్షలాది కామెంట్లతో ఆమెపై విరుచుకుపడ్డారు.

 తట్టుకోలేక అనసూయ అదృశ్యం

తట్టుకోలేక అనసూయ అదృశ్యం

నెటిజన్లు ముప్పేట దాడి ప్రారంభించడంతో.... వారికి సమాధానం చెప్పుకోలేక అనసూయ సోషల్ మీడియా వేదిక నుండి అదృశ్యమైంది. ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను మూసి వేసింది.

 అనసూయ వివరణ

అనసూయ వివరణ

బాలుడి ఘటనతో తనపై విమర్శలు రావడంతో అనసూయ మంగళవారం ఓ ఛానల్ ద్వారా వివరాణ ఇచ్చారు. ‘‘ఇలాంటి దానికి నేను వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. సోమవారం మా అమ్మను కలిసేందుకు తార్నాక వెళ్లాను. అక్కడ నేను కారు దిగి నడుచుకుంటూ వెళుతుంటే ఓ ఉమెన్, వాళ్ల బాబు స్కూటీ మీద వెళుతూ నా వీడియో తీశారు. అలా చేయవద్దని చెప్పాను. అయినా వారు వినలేదు'' అని అనసూయ తెలిపారు.

 తిట్టాను, ఫోన్ బ్రేక్ చేయలేదు

తిట్టాను, ఫోన్ బ్రేక్ చేయలేదు

‘‘నేను ఎంత చెప్పినా వారు వినలేదు. బైక్ నా ముందు వరకు వచ్చి వీడియో తీయడానికి ట్రై చేశారు. నేను నా ఫేస్ కవర్ చేసుకున్నాను. కొంచెం కోపంగా తిట్టాను, కానీ ఫోన్ పగలగొట్టలేదు. ఆ అబ్బాయిని కూడా ఏమీ అనలేదు'' అని అనసూయ తెలిపారు.

 పిల్లలంటే నాకు చాలా ఇష్టం

పిల్లలంటే నాకు చాలా ఇష్టం

‘‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వారిని నేనెప్పుడూ ఏమీ అనను. వాళ్ల అమ్మను కోపంతో తిట్టాను. వారు వినకపోతే కొంచెం అరిచాను. తప్పుకోండి అని వెళ్లిపోయాను. తప్పుకోండి అన్నపుడు ఫోన్ కింద పడిందా? లేదా? నాకు గుర్తు లేదు. బహుషా కింద పడి పగిలిపోయిందేమో? నాకు తెలియదు'' అని అనసూయ తెలిపారు.

 అంత కఠినాత్మురాలిని కాదు

అంత కఠినాత్మురాలిని కాదు

‘‘ఫోన్ తీసి పగలగొట్టడం, పిల్లలను అబ్యూస్ చేయడం లాంటి పనులు నేను చేయను. నేను అంత కఠినాత్మురాలిని కాదు. అపుడు నేను ఏదో టెన్షన్లో ఉండి అలా చేశాను'' అని అనసూయ వివరణ ఇచ్చారు.

అనసూయ మీద కంప్లయింట్

తమ పట్ల దుర్భాషలాడటంతో పాటు ఫోన్ పగలగొట్టిన ఘటనపై బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు.

English summary
Popular anchor-actor Anasuya Bharadwaj was at the centre of a controversy on Tuesday after a police complaint was filed against her for allegedly breaking a fan's phone. After this incident, Anasuya closed her social media accounts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu