అలాంటి పోస్టర్లు చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు: అనసూయ ఆసక్తికర కామెంట్స్
అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నటించిన తాజా చిత్రం 'కథనం'. ఈ సినిమా విడుదలకు దగ్గరవుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

పోస్టర్స్ చూస్తాననుకోలేదు
నాగార్జున సినిమాతో పాటే తన సినిమా కూడా విడుదలవుతుండడంతో అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రోడ్డు మీద వెళ్తుంటే నాగ్ సార్ సినిమా పోస్టర్.. పక్కనే నా సినిమా పోస్టర్.. మళ్లీ నాగ్ సారి పోస్టర్.. తర్వాత నా పోస్టర్.. ఇలా సార్ పక్కన నా పోస్టర్ ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి పోస్టర్ చూడాల్సి వస్తుందని కూడా ఊహించలేదు' అని చెప్పుకొచ్చింది.

ఏ సినిమా చూస్తారో మీ ఇష్టం
‘మన్మథుడు 2' విడుదలవుతున్న రోజునే ‘కథనం' వస్తుండడంపైనా అనుసూయ కామెంట్స్ చేసింది. ‘మీ అందరికీ తెలుసు నాగ్ సార్ అంటే నాకు ఇష్టం. ఆయన సినిమా రోజే మాది రావడం అనుకుని చేసింది కాదు. కాబట్టి మీకు ఏ సినిమా చూడాలనుకుంటే అది చూడండి' అని ఆమె పేర్కొంది.

మీరు ఏం రాస్తే అదే అవుతారు
ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి.. ‘మీరు ఏం రాస్తే అదే అవుతారు. నా గురించి మంచి రాశారు.. చెడు రాశారు.. తిట్టారు.. పొగిడారు. నా మీద వచ్చిన వార్తలు చూసి, నేనింకా మొండిదాన్ని అయ్యాను. స్ట్రాంగ్‌గా అయ్యాను. సంకల్పం ఎక్కువైపోయింది. నేనెవరి మీదా కంప్లైంట్ చేయడం లేదు' అని అనసూయ చెప్పుకొచ్చింది.

‘కథనం’ గురించి..
అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం'. ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బీ నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అనసూయతో పాటు వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











