Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ విషయం చెప్పే గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్.. నెటిజన్‌పై అనసూయ కామెంట్స్
అనసూయపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాకు, అనసూయకు అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె చేసే ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఆమె వైపు ఎప్పుడూ ఓ కన్ను కనిపెట్టే ఉంటారు నెటిజన్లు. అలా ఈ మధ్య అనసూయ స్పెషల్ సాంగ్‌తో నెట్టింట్లో మంట పెట్టేసింది. చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ మరింతగా వైరల్ అయింది.
స్పెషల్ సాంగ్స్..
మామూలుగా అయితే సినిమా భాషలో ఐటం సాంగ్ అంటుంటారు. కానీ అనసూయ మాత్రం దానికి వ్యతిరేకంగా. అమ్మాయిలను వస్తువులుగా చూసే వాళ్లు మాత్రమే అలా ఐటం సాంగ్ అంటారని, కానీ అది స్పెషల్ సాంగ్ అనాలంటూ అనసూయ చెప్పుకొస్తుంది. అలా అనసూయ చేసిన పైన పటారం అనే స్పెషల్ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
మాస్ స్టెప్పులు కేక..
ఇక అనసూయ వేసిన మాస్ స్టెప్పులు మాత్రం యూత్‌కు పిచ్చెక్కించాయ్. కార్తికేయతో కలిసి అనసూయ అదిరిపోయే మూమెంట్స్ చేసింది. నాటుగా కసిగా కనిపించిన అనసూయ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇక వీటిపై యథావిథిగా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.
సోషల్ మీడియాలో ట్రోల్స్..
మామూలుగా అనసూయ అంటే ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇలా స్పెషల్ సాంగ్‌లో అనసూయ రెచ్చిపోయి కనిపించడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే వీటిలో ఓ నెటిజన్ మాత్రం అనసూయకు మద్దుతగా ఓ కామెంట్ చేశాడు. దానిపై అనసూయ రియాక్ట్ అయింది.
నెటిజన్ కామెంట్..
తెలుగు వాళ్లకు తెలుగులో విలువ ఇవ్వరు.. టాలెంట్ చూడరు.. మళ్లీ సినిమాల్లోకి తెలుగు వాళ్లని ఎందుకు తీసుకోరు అని అంటారు.. వస్తే ఇలా తప్పుగా తిడతారు.. ఇలా మాట్లాడితే తెలుగు వాళ్లు ఇండస్ట్రీకి రావాలంటే భయపడతారు.. మారండి కొంచమైనా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గట్స్ ఉన్నందుకు..
ఆ కామెంట్ చూసిన అనసూయ ఎమోషనల్ అయింది. ఆ కామెంట్‌ను రౌండప్ చేసి.. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడే అంతా మంచి జరుగుతుందనే ఆశ కలుగుతుంది.. అందుకే మంచి జరిగే వరకు ప్రయత్నాన్ని వదలను.. ఇలాంటివి ధైర్యంగా చెప్పే హృదయం, గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్ అంటూ అనసూయ ఎమోషనల్ అయింది.