»   » సోగ్గాడు నాగార్జునతో అనసూయ డాన్స్ (ఫోటోస్)

    సోగ్గాడు నాగార్జునతో అనసూయ డాన్స్ (ఫోటోస్)

    By Bojja Kumar

    హైదరాబాద్: కింగ్‌ నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రానికి సంబంధించిన మైసూర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని కొత్త స్టిల్స్ విడుదల చేసారు. స్లైడ్ షోలో ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

     

    ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ- ''ఫస్ట్‌ టైమ్‌ 'సొగ్గాడే చిన్నినాయనా' వంటి ఫుల్‌ కామెడీ మూవీ చేస్తున్నాను. సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరియేషన్లు వున్న క్యారెక్టర్స్‌ ఈ చిత్రంలో చేస్తున్నాను. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది అన్నారు.

    ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్‌ అది. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు నాగార్జున.

    దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మంచి రచయిత కూడా. అతను చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒరిజినల్‌ స్టోరీ లైన్‌ను ఉయ్యాలా జంపాలా ఫేమ్‌ రామ్మోహన్‌ ఇచ్చారు. కళ్యాణ్‌ ఆ పాయింట్‌ను బాగా డెవలప్‌ చేశాడు. ఇటీవల మైసూర్‌లో భారీ షెడ్యూల్‌ చేశాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మంచి రిలీజ్‌ డేట్‌ చూసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

    కింగ్‌ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

    అనసూయతో నాగ్ డాన్స్

    అనసూయతో నాగ్ డాన్స్

    సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో అనసూయతో కలిసి డాన్స్ చేస్తున్న నాగార్జున.

    మరదలు

    మరదలు

    ఈ చిత్రంలో నాగార్జున మరదలిగా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం.

    లావణ్య, నాగ్

    లావణ్య, నాగ్

    సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జున, లావణ్య త్రిపాఠి.

    నాగ్, రమ్య

    నాగ్, రమ్య

    సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో రమ్య కృష్ణ, నాగార్జున.

    ఫైట్స్

    ఫైట్స్

    సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జున యాక్షన్ సీన్స్.

    హంసా నందిని, నాగ్

    హంసా నందిని, నాగ్

    సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో హంసా నందిని, నాగార్జున

    Please Wait while comments are loading...

    Telugu Photos

    Go to : More Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X