నింద నిజమైతే తప్పక దిద్దుకో... ‘రంగస్థలం 1985’లో అనసూయ

రంగస్థలం 1985పై అనసూయ ఓ పోస్టు చేసింది. ముఖం కనిపించకుండా ఓ ఫోటో పోస్టు చేసింది.

By Bojja Kumar

Recommended Video

Ram Charan Working With Anchor Anasuya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ కీలకమైన పాత్ర పోసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఒకటి హాట్ టాపిక్ అయింది.

'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..' అనే క్యాప్షన్ తో 'రంగస్థలం 1985' సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను యాంకర్ అనసూయ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.

అది అనసూయేనా?

ఆమె పోస్టు చేసిన ఫోటోలో ఫేస్ కనిపించడం లేదు. అయితే అది అనసూయ ఫోటోనే అయి ఉంటుందని, ఆ ఫోటోకు పెట్టిన క్యాప్షన్ ఆమె సినమాలో చెప్పే డైలాగ్ అయి ఉంటుందని భావిస్తున్నారు.

రంగస్థలం 1985

రంగస్థలం 1985

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం "రంగస్థలం 1985". రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో మూవీ అన‌గానే ఎన్నో అంచ‌నాల...., అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

సుకుమార్

సుకుమార్

విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌; ఆది స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అందిస్తున్న స‌హ‌కారంతో సినిమా చాలా బాగా వ‌స్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

పల్లెటూరి నేపథ్యం

పల్లెటూరి నేపథ్యం

చాలా మంది ఈ చిత్రం 1985 కాలంలో జరిగిన రంగస్థల నాటకాల గురించి ఉంటుందని ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఊహలకు, అనుమానాలకు చిత్ర దర్శకుడు సుకుమార్ తెర దించారు. ఈ సినిమాకు, నాటకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా ఉండరు. ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అంతా ఒక చోట గుమిగూడి ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని సుకుమార్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X