Don't Miss!
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనసూయకు పెళ్లి కాలేదా?: వాటిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్!, 'గాయత్రి'లో లుక్ అదిరింది..

బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా బాగానే రాణిస్తోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. 'పెళ్లి కాని' అమ్మాయిల పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదలైన గాయత్రి పోస్టర్ లోనూ 'మిస్ శ్రేష్ట జయరాం'గా కనిపించింది అనసూయ. అంటే, ఈ సినిమాలోనూ అనసూయది పెళ్లి కాని అమ్మాయి పాత్రే అన్నమాట.

'మిస్' అనసూయ..:
పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు, నటీమణులకు అవకాశాలు తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ అనసూయ మాత్రం పెళ్లయ్యాకే అటు బుల్లితెరలోనూ.. ఇప్పుడు వెండితెరపై కూడా దూసుకుపోతోంది. నిజ జీవితంలో శ్రీమతి అయిన అనసూయ.. వెండితెరపై మాత్రం మిస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.

అనసూయ ఇంట్రెస్ట్ వాటిపైనే..:
సాయిధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించినా.. 'సోగ్గాడే చిన్ని నాయన'లో నాగార్జున సరసన కనిపించినా.. అవన్నీ పెళ్లి కాని అమ్మాయి పాత్రలే కావడం గమనార్హం. దీంతో 'మిస్' పాత్రలంటేనే అనసూయ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.

మోహన్ బాబు 'గాయత్రి':
మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి'లో అనసూయ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. అనసూయ పాత్రను పరిచయం చేసేలా చిత్రయూనిట్ తాజాగా ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది.

పవర్‌ఫుల్ జర్నలిస్టుగా అనసూయ:
తాజాగా విడుదలైన పోస్టర్ తో గాయత్రిలో అనసూయ పాత్రపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. 'మిస్ శ్రేష్ట జయరాం' పాత్రలో పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. పోస్టర్ లో అనసూయ తీక్షణమైన చూపులు ఆమె పాత్ర ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నాయి. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కాబోతోంది.

అనసూయ కామెంట్:
గాయత్రిలో తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు అనసూయ. 'వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది..' అన్న కామెంట్ జతచేసి పోస్టర్ వదిలారు. పోస్టర్ పై నెటిజెన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తుండం విశేషం. నెటిజెన్స్ స్పందన చూసి.. 'మీ ప్రోత్సాహం, ప్రోద్బలం ఇలాగే ఉండాలని..' అనసూయ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

రియల్ లైఫ్‌లో 'శ్రీమతి':
రీల్ లైఫ్ లో మిస్ పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటున్న అనసూయ.. రియల్ లైఫ్ లో మేరీడ్ వుమెన్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనసూయ భర్త కూడా సినిమాల వైపు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.