»   » నా తప్పు లేకున్నా తిడుతున్నారు, మూసివేసింది అందుకే..రంగస్థలం రిలీజ్ తరువాత మళ్ళీ!

నా తప్పు లేకున్నా తిడుతున్నారు, మూసివేసింది అందుకే..రంగస్థలం రిలీజ్ తరువాత మళ్ళీ!

Subscribe to Filmibeat Telugu
అనసూయ కఠిన నిర్ణయం ..

అందం, ఆకట్టుకునే మాటలు, చలాకీతనంతో అనసూయ తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆ మధ్యన వచ్చిన క్షణం చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. విన్నర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన పేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలని మూసివేసింది. ఆ మధ్యన జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన అనసూయపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. నెటిజన్లు అనసూయని తిడుతూ కామెంట్లు పెడుతుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుతుంది.

Anasuya gives clarification on her social media accounts

అనసూయ తన సామజిక మాధ్యమ ఖాతాలని మూసివేసిన తరువాత తొలిసారి స్పందించింది. తాను ఎందుకు తన అకౌంట్లని మూసివేయవలసి వచ్చిందో వివరణ ఇచ్చింది. ఓ అభిమాని సెల్ఫీ అడగగా అనసూయ అతడి మొబైల్ ని పగలగొట్టినట్లు వార్తలు వచ్చాయి.

ఆ ఘటనలో తన తప్పు లేదని అనసూయ అన్నారు. తన గురించి తెలియకుండానే ఓ మీడియా వర్గం తనని దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేసిందని అనసూయ అన్నారు. దీనితో అభిమానుల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్లాయి. వారు ఆగ్రహంతో అసభ్య కామెంట్లు పెడుతున్నారని అనసూయ అన్నారు.

అందుకే తన సోషల్ మీడియా ఖాతాలని క్లోజ్ చేసానని అనసూయ అన్నారు. రంగస్థలం చిత్ర విడుదల తరువాత తిరిగి తన పేస్ బుక్, ట్విట్టర్ ని ఓపెన్ చేస్తానని అనసూయ అన్నారు.

English summary
Anasuya gives clarification on her social media accounts. She will reopen FB and Twitter after Rangasthalam release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu