సెక్సీ డ్రెస్సుపై కామెంట్: భగ్గుమన్న యాంకర్ అనసూయ!
తన డ్రెస్సుపై కామెంట్ చేసిన వ్యక్తిపై అనసూయ మండిపడింది. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో తనకు తెలుసని రిప్లై ఇచ్చింది.
మహిళల వస్త్రధారణ విషయంలో ట్రెండును ఫాలో అయ్యే వారికి... చాందస వాదులకు మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మహిళలు సెక్సీగా కనిపించే డ్రెస్సులు వేయడం ఏమిటి? అలాంటి డ్రెస్సుల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయంటూ విమర్శలు తరచూ వింటూనే ఉన్నాం.
ముఖ్యంగా సినిమా స్టార్లు, టీవీ స్టార్లు ఇలాంటి విమర్శలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. గతంలో చాలా సార్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న యాంకర్ అనసూయ... తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసింది. అయితే ఆ కామెంట్లు చేసిన వారికి ఆమె ధీటుగా సమాధానం చెప్పడం గమనార్హం.

ఆ డ్రెస్సులేంటి అనసూయ?
ఇటీవల అనసూయ పై ఒక వ్యక్తి కామెంట్ చేస్తూ....''అనసూయ నీకు ఏమైనా బుద్ది ఉందా.. నువ్వు ఏమి వేసుకుంటున్నావో నీకు తెలుస్తోందా? నీవు వేసుకుంటున్న డ్రెస్సుల వల్ల మేము మా ఫ్యామిలితో కలిసి ఆ షో చూడలేకపోతున్నాము'' అంటూ విమర్శించాడు.
Recommended Video


అనసూయ ఘాటు రిప్లై
'నీకు ఇష్టం లేకుంటే షో చూడకు. మేము ఏమి వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో నువ్వు నాకు చెప్పాల్పిన పని లేదు. వేరే వారి విషయాల్లో తలదూర్చకూడదనే కనీస మర్యాద కూడా నీకు తెలిసినట్లు లేదు. సెలబ్రిటీలపై ఇలాంటి చీప్ కామెంట్లు చేయడం ప్రతి ఒక్కరికీ అలవాటయిపోయింది' అంటూ అనసూయ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

నేను అమ్మాయినే, అమ్మనే..
‘నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు. నేనూ అమ్మాయినే, ఒకరికి భార్యనే, ఇద్దరు పిల్లలకు అమ్మనే. నా వృత్తిలో భాగంగా రకరకాల డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుంది. అయినా నీ లాంటి వారికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు' అంటూ అనసూయ పైర్ అయింది.

నిన్ను నువ్వు అదుపు చేసుకో
‘నీకు నేను చేసే కార్యక్రమాలు నచ్చకుంటే చూడటం మానేయ్. నీకు బలవంతంగా ఎవరూ చూపించడం లేదు. నేను ఒక ఎంటర్టెనర్‌ను, నా పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తప్పు అనేది మేం వేసుకునే డ్రెస్సుల్లో లేదు, మీ ఆలోచనల్లో ఉంది' అంటూ అనసూయ ధీటుగా సమాధానం ఇచ్చింది.

అవన్నీ జరుగడానికి కారణమేంటి?
మన సమాజంలో చాలా సార్లు చిన్న పిల్లలపై, 65 ఏళ్ల ముసలి వాళ్లపై కూడా లైంగిక వేధింపులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. మరి వాళ్లలో ఏం ఎక్స్ ఫోజింగ్ చూసి ఇవన్నీ జరుగుతున్నాయి? మనుషుల్లో తప్పుడు ఆలోచనలు ఉన్నపుడే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయే తప్ప మేము వేసుకునే డ్రెస్సుల వల్ల కాదు అంటూ అనసూయ మండి పడింది.


Click it and Unblock the Notifications











