»   » మోహన్ బాబు సినిమాలో యాంకర్ అనసూయ

మోహన్ బాబు సినిమాలో యాంకర్ అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. క్షణం సినిమాతో నటిగా... విన్నర్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో ఐటం గర్ల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అసూయ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో నటిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ మరో సినిమా చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్లో మదన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Anchor Anasuya Rejected Jr NTR Bigg Boss Offer!!
Anasuya in Mohan Babu’s film

సినిమాలో ఓ కీలకమైన పాత్రకు ఆమెను తీసుకుంటున్నారని, ఆ పాత్రకు అనూసూయ యాటిట్యూడ్ అయితేనే బాగా సూటవుతుందనే కారణంతో ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడనుంది.

కొన్ని రోజులుగా అనసూయ గురించి బయట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బిగ్ బాస్ రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అనసూయ స్పందిస్తూ..... తాను టీవీ, సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నానని, బిగ్ బాస్ షో చేసేంత సమయం లేదని స్పష్టం చేసింది.

English summary
Director Madan is coming up with a film starring Mohan Babu and his elder son Vishnu, and has roped in Anasuya for the same. It is an impactful role and many from the film’s unit suggested Anasuya’s name for it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu