రంగమ్మత్తని మరచిపోకముందే.. అనసూయకు మరో క్రేజీ ఆఫర్!
స్టార్ యాంకర్ అనసూయ రంగమ్మత్త పాత్రలో అందరిని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. రంగస్థలంచిత్రంలో అనసూయ పోషించిన ఈ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. రంగస్థలం చిత్రంలో చాలా కీలకమైనదనే సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల అనసూయని మంచి అవకాశాలు వరిస్తున్నాయి.
తాజాగా అనసూయకు మరో బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో క్రేజీ మల్టి స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

అనిల్ రావిపూడి పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలతో తిరుగులేని కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎఫ్ 2 చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అంటే అనసూయకు బంపర్ ఆఫర్ దక్కినట్లే.


Click it and Unblock the Notifications











