టార్గెట్ రీచ్ అవ్వని అనసూయ, అదనపు ఆదాయం కోసమే ఇదంతా?
తెలుగు యాంకర్లలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది ఎవరు? అంటే అందరూ ముందుగా చెప్పేది పేరు అనసూయ. అందంతో పాటు యూనిక్ స్టైల్‌తో ఆమె సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది అభిమానులను, ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు.
ఇటు ఫేస్ బుక్, అటు ట్విట్టర్‌తో పాటు ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమె క్రమం తప్పకుండా పోస్టులు పెడుతుంటారు. వాటితో సరిపెట్టని ఈ టాప్ యాంకర్ 'షేర్‌చాట్'లో కూడా ఖాతా తెరిచారు.
టార్గెట్ రీచ్ అవ్వని అనసూయ
‘షేర్‌చాట్'లో అనసూయ ఫాలోవర్స్ పరంగా తాను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు. అందుకే నెటిజన్లను ఆకర్షించడానికి సరికొత్త వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఆ వీడియో లింకులను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ.... దయచేసి నన్ను షేర్ చాట్లో కూడా ఫాలోఅవ్వండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

అదనపు ఆదాయం ఉంటుందా?
మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి షేర్‌చాట్ లాంటి సంస్థలు ఫేమస్ సెలబ్రిటీలతో.... ఈ విధంగా ప్రమోట్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. వాటి ద్వారా ఆయా సెలబ్రిటీలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందట. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత ఆదాయం ఉంటుందని టాక్.

సోషల్ మీడియాపై అనసూయ స్పెషల్ ఫోకస్
యాంకరింగ్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకున్న అనసూయ... తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమె పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కూడా అవకాశాలు రావడానికి ప్రధాన కారణం. ఇదంతా సోషల్ మీడియా వల్లే కాబట్టి... అనసూయ ఈ విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

సెలెక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటూ..
‘రంగస్థలం'లో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే తనకు నటిగా మంచి గుర్తింపు తెచ్చే, కెరీర్‌కు ప్లస్సయ్యే సినిమాలు, పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ అనసూయ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె యాత్ర, సచ్చిందిరా గొర్రె, కథనం చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











