బాబోయ్... మరీ ఇంత ధైర్యమేంటి అనసూయ... పులితో పరాచకాలా?
Recommended Video

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ తన టీవీ షోలు, సినిమాలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా అనసూయ పోస్టు చేసిన ఓ వీడియో అభిమానులను ఆశ్చర్య పరిచింది.
ఈ వీడియోలో అనసూయ పులితో ఆటలాడుతోంది. బిగ్ క్యాట్‌తో మాట్లాడుతున్నాను అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. సినిమా షూటింగులో భాగంగా అనసూయ థాయ్‌లాండ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఖాళీ సమయం దొరకడంతో పట్టాయా అనే ప్రాంతంలో ఉండే టైగర్ టెంపుల్‌ను సందర్శించారు.
పులితో అనసూయ
పనిలో భాగంగా థాయ్‌లాండ్ వచ్చాను. ఇక్కడి టైగర్ టెంపుల్ సందర్శించినట్లు అనసూయ తెలిపారు. అయితే ఈ పోస్టుపై కొందరు అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు.

అనసూయ ఫోస్టుపై ఫన్నీ కామెంట్స్
పులితో కలిసి దిగిన అనసూయ పోస్టుపై ఆమె అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏమిటో మీరే స్వయంగా ఓ లుక్కేయండి.

ట్రెండీ ట్రెండీగా
టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతున్న అనసూయ ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. తాజాగా తనకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ డ్రెస్సులో అందంగా మెరిసిపోయింది. ఆమె వేసిన చిరుగుల జీన్స్ కొందరు అభిమానులకు తెగ నచ్చేశాయి.

అనసూయ సినిమాలు
అనసూయ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర' లో కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో పాటు సచ్చిందిరా గొర్రు, కథనం చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











