Just In
- 5 hrs ago
‘వకీల్ సాబ్’ నుంచి సర్ప్రైజింగ్ న్యూస్: ఇందులో పవన్ కల్యాణ్ అలా కనిపిస్తాడట
- 6 hrs ago
ఆ సాంగ్ వింటే మూడు బ్రేకప్స్ గుర్తుకు వచ్చాయట.. నవీన్ పొలిశెట్టి నిజంగా ‘జాతి రత్నం’!
- 7 hrs ago
రాజేంద్ర ప్రసాద్‌కు మోడీ పేరు ఎందుకు పెట్టామంటే.. క్లైమాక్స్‌పై దర్శకుడు భవానీ శంకర్ క్లారిటీ
- 7 hrs ago
చెర్రీ కోసం అడవుల బాట పట్టిన ఉపాసన.. మెగా కోడలి పిక్స్ వైరల్
Don't Miss!
- News
మయన్మార్: ఆందోళకారులపై భద్రతా బలగాల కాల్పులు: 38 మంది మృతి
- Finance
శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధర, రూ.45,000 దిగువకు..! వెండి రూ.1500 డౌన్
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- Automobiles
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ స్టార్. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం కూడా రాదు. ఉండదు. సుమకు ధీటుగా యాంకరింగ్ ఇండస్ట్రీలో ఎదిగాడు. ఇప్పుడు ఇక్కడ ఇలా తెచ్చుకున్న క్రేజ్‌నే వెండితెరపై హీరోగా ఎదిగేందుకు వాడుకుంటున్నాడు. ఇది వరకు ప్రదీప్ కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో మెరిశాడు. కానీ మొదటి సారిగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రదీప్ తన లక్‌ను పరీక్షించుకోబోతోన్నాడు.

ఎట్టకేలకు మోక్షం..
మామూలుగా ప్రదీప్ హీరోగా గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆ మధ్య ఓటీటీలోనే సినిమా విడుదల చేస్తామని అన్నారు. కానీ థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేస్తామని ఉద్దేశ్యంతో ఇన్నాళ్లూ ఎదురుచూశారు. మొత్తానికి ఈ సినిమాను జనవరి 29న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రమోషన్స్ పెంచేశారు..
ఇక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ కార్యక్రమాలను పెంచేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా నిర్వహించేశారు.

ప్రమోషనల్ సాంగ్..
అయితే తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి ప్రమోషన్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో యాంకర్ ప్రదీప్, సద్దాం కలిసి ఓ పబ్‌లో పార్టీ చేసుకుంటారు. లవ్, పెళ్లి అనేవి వద్దంటూ ప్రదీప్ హిత బోధ చేస్తాడు. అమ్మాయిలకు దూరంగా ఉండాలని చెబుతుంటాడు. ఇక ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడాడు.

ఆ ముగ్గురు యాంకర్లు..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రమోషన్ సాంగ్ కోసం అనసూయ, రష్మీ, శ్రీముఖిలు కదిలి వచ్చారు. ఈ ముగ్గురికి ప్రదీప్‌తో మంచి ర్యాపో ఉంది. బుల్లితెరపై కలిసి ఎన్నో ఈవెంట్లు చేశారు. అలా ఈ ముగ్గురు కూడా ప్రదీప్ కోసం వచ్చారు. చివర్లో అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అయితే అంత వరకు అమ్మాయిలకు దూరంగా ఉండాలని చెప్పిన ప్రదీప్ ఆ ముగ్గురితో జంప్ అవ్వడంతో సద్దాం ఒంటరిగా మిగిలి బక్రా అయిపోయాడు.