»   »  ఆ గొడవ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు.... అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చేసింది!

ఆ గొడవ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు.... అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఓ గొడవ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ మూసి వేసిన సంగతి తెలిసిందే. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి పదేళ్ల బాలుడి సెల్ ఫోన్ పగలగొట్టిందనే ఆరోపణల నేపథ్యంలో తనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శల దాడి మొదలైన నేపథ్యంలో తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను ఆమె మూసివేశారు.


దాదాపు నెలన్నర తర్వాత అనసూయ మళ్లీ సోషల్ మీడియా తలుపులు తెరిచారు. అనసూయ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' చిత్రంలో నటిస్తోంది. ఇందులో రంగమ్మత్త పాత్ర పోషిస్తున్న ఈ హాట్ యాంకర్ తన ఫస్ట్‌లుక్ పోస్టర్ పోస్టు చేయడం ద్వారా మళ్లీ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

రంగస్థలం సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఆమె చేస్తున్న టీవీ షోలకు సంబంధించి డీటేల్స్ అభిమానులతో షేర్ చేసుకున్నారు అనసూయ. ఇకపై అనసూయ నుండి ప్రతి రోజూ తన యాక్టివిటీస్, టీవీ షోస్, సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఉంటడం ఖాయం అంటున్నారు.

English summary
Anasuya has reintroduced into social media. It is known that a woman had previously complained to Anasuya that she had broken her cell phone and had been abusing her son for the past few days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X