రామ్ చరణ్ మూవీలో ఐటం సాంగ్ గురించి అనసూయ స్పందన!

By Bojja Kumar

హైదరాబాద్: 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీలో అనసూయ పెర్ఫార్మెన్స్, గ్లామర్ చూసిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం అనూయను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. స్పెషల్ సాంగ్ తో పాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.

'ఊపిరి' ఆడియో : అనసూయ డాన్సే హైలెట్ (ఫోటోస్)

సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పదో చిత్రం ఇది. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కోసం అనసూయను ఐటం సాంగు కోసం తీసుకున్నారని టాక్.

ఇష్టం లేకున్నా ఆయన కోసమే చేసా.... (అనసూయ ఇంటర్వ్యూ)

Anasuya reacts on Ram Charan movie offer

ఈ వార్తలపై అనసూయ స్పందించింది. 'అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్ధం కాదు. నన్ను ఇప్పటివరకూ చరణ్ సినిమాకు సంబంధించిన యూనిట్ లో ఒక్కరు కూడా కలవలేదు' అని అనసూయ స్పష్టం చేసారు. అనసూయ వ్యవహారం చూస్తుంటే రామ్ చరణ్ సినిమాలో ఓకే చెప్పేట్టే ఉంది.

అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఫిబ్రవరి 22నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

సెక్సియెస్ట్ రీమార్క్స్: యాంకర్ అనసూయకు కోపం వచ్చింది!

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణ మురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు... సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X