యాంకర్ అనసూయ సినిమాల్లోకి వస్తోంది!

By Bojja Kumar

హైదరాబాద్: యాంకర్‌గా తక్కువ కాలంలో కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారభించి....జబర్దస్త్ షోతో పాపులర్ అయి, ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆ మధ్య అత్తారింటికి దారేది, రేసు గుర్రం లాంటి చిత్రాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి.

అయితే అప్పట్లో ఆమె ఏ ఆఫర్ కూడా ఒప్పుకోలేదు. మా హీరో సినిమా తిరస్కరిస్తావా? అంటూ ఆ మధ్య పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ వాగ్వివాదానికి దిగితే వారితో సోషల్ మీడియాలో గొడవ కూడా పెట్టుకున్నారు. ఆ మధ్య ఇదో హాట్ టాపిక్ అయింది. ఆ సంగతి పక్కన పెట్టి తాజా విషయానికొస్తే ఆమె ఓ సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Anasuya Ready to do a Film

థ్రిల్లర్ జేనర్లో తెరకెక్కబోయే చిత్రంలో ఆమె నటించబోతోంది. ఈ చిత్రం ద్వారా రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. తొలుత ఆమె ఈ పాత్ర ఒప్పుకోవడానికి సందేహించిందని, స్ర్కిప్టు విన్న తరువాత ఒప్పుకోకుండా ఉండలేక పోయిందని టాక్.

ఇన్నాళ్లు మనకు యాంకర్‌గా కనిపించిన అనసూయ వేరు....సినిమాలో మనం చూడబోయే అనసూయ వేరుగా ఉంటుంది, పూర్తి డిఫరెంటుగా ఆమె రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. యాంకర్ గా సక్సెస్ అయిన అనసూయ సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X