వెంకటేష్ సినిమాలో అనసూయ పాత్ర ఇదే, దిల్ రాజు నిర్మాత
చాలా రోజులుగా వెండితెర మీద సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న అనసూయ కల ఈ సినిమాతో నెరవేరింది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంతల నటనకు ఎంత పేరు వచ్చిందో అనసూయకు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విడుదల తరువాత అనసూయ వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.
రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్‌హిట్ సాధించిన అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో 'ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ కోసం ఒక పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో అనసూయ సిటి అమ్మాయిగా కనిపించబోతోందని సమాచారం. రంగస్థలం సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించిన అనసూయ ఈ సినిమాలో అందుకు భిన్నంగా సిటి అమ్మాయిగా నటించడం విశేషం.


Click it and Unblock the Notifications











