»   » యాంకర్ అనసూయ సూపర్ హాట్ లుక్ (ఫోటో)

యాంకర్ అనసూయ సూపర్ హాట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ వస్తోంది అనసూయ. ఆకట్టుకునే అందం, చలకీతనం, మాటల్లో గడుసుతనంతో ఆమె యాంకరింగ్ రంగంలో దూసుకెళ్లడంతో పాటు సినిమాలు అవకాశాలు కూడా దక్కించుకుంటోంది.

అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎక్కువే. ఇక తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా తేజ సారీస్ కోసం ఆమె ప్రత్యేకంగా ఫోటో షూట్లో పాల్గొంది. బ్రైట్ ఎల్లో టాప్, లైట్ గ్రీన్ స్కర్టు ధరించిన అనసూయ తన సూపర్ హాట్ లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు ఇపుడు మంచి స్పందన వస్తోంది. దీన్ని బట్టి అనసూయ మోడలింగ్ రంగంలో కూడా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Anasuya's Colorful Pose for Teja Sarees

నాగార్జున సినిమాలో.....
నాగార్జున హీరోగా నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అనసూయ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇందులో అనసూయ నాగార్జున మరదలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఇందులో ఓ పాటలో నాగార్జునతో కలిసి డాన్స్ కూడా చేస్తోంది. ఈ సినిమా తర్వాత అనసూయకు మరిన్ని అవకాశాలు వస్తాయని తెలుస్తోంది.

English summary
Dressed in bright yellow top and green skirt, the beautiful TV anchor Anasuya casts a magic spell on her fans with this stunning photoshoot which she did exclusively for Teja Sarees. It is Anasuya's charming smile that adds to the beauty of this image.
Please Wait while comments are loading...