యాంకర్ అనసూయ.... సినిమా టైటిల్ ఇదే!

By Bojja Kumar

హైదరాబాద్: ఇప్పటి వరకు బుల్లితెరపైనే తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ అనసూయ త్వరలో వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రవికాంత్ పేరపు దర్శకత్వంలో ఆమె నటించబోతోంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖారారైనట్లు వార్తలు వినపిస్తున్నారు. ‘క్షణం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె అడవి శేష్ కు జోడీగా నటించబోతోందట. 2015 మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

యాంకర్‌గా తక్కువ కాలంలో కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారభించి....జబర్దస్త్ షోతో పాపులర్ అయి, ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆ మధ్య అత్తారింటికి దారేది, రేసు గుర్రం లాంటి చిత్రాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి.

Anasuya’s debut film gets a Title

అయితే అప్పట్లో ఆమె ఏ ఆఫర్ కూడా ఒప్పుకోలేదు. మా హీరో సినిమా తిరస్కరిస్తావా? అంటూ ఆ మధ్య పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ వాగ్వివాదానికి దిగితే వారితో సోషల్ మీడియాలో గొడవ కూడా పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది.

‘క్షణం' చిత్రం థ్రిల్లర్ జేనర్లో తెరకెక్కబోయే చిత్రమని తెలుస్తోది. దర్శకుడు రవికాంత్ పేరెపు అనసూయ పాత్రను చాలా కీలకంగా చూపించబోతున్నాడట. సినిమాలో హీరోయిన్ ఆమెనే అంటున్నారు. తొలుత ఆమె ఈ పాత్ర ఒప్పుకోవడానికి సందేహించిందని, స్ర్కిప్టు విన్న తరువాత ఒప్పుకోకుండా ఉండలేక పోయిందని టాక్.

ఇన్నాళ్లు మనకు యాంకర్‌గా కనిపించిన అనసూయ వేరు....సినిమాలో మనం చూడబోయే అనసూయ వేరుగా ఉంటుంది, పూర్తి డిఫరెంటుగా ఆమె రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. యాంకర్ గా సక్సెస్ అయిన అనసూయ సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X