రంగస్థలం: యాంకర్ అనసూయ ‘రంగమ్మత్త’ లుక్ అదరహో....
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' చిత్రంలో యాంకర్ అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన గ్లామర్‌తో బుల్లితెరను, సోషల్ మీడియాను హీటెక్కించిన అనసూయ పల్లెటూరి నేపథ్యంలో సాగే 'రంగస్థలం'లో ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది? ఎలాంటి లుక్‌లో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోంది? అనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఎట్టకేలకు ఈ చిత్రంలో అనసూయ పాత్ర గురించి వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఇందులో రంగమ్మత్తగా అనసూయ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది. ఆమెపై సినిమాలో ప్రత్యేకంగా ఓ పాట కూడా ఉంది.

ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా అనసూయ పల్లెటూరి కట్టుబొట్టుతో చాలా డిఫరెంట్ లుక్‌లో ఉండటం అభిమానులను చాలా ఎగ్జైట్ చేస్తోంది. ఆమె లుక్ అద్భుతంగా ఉందని, అనసూయ ప్రదర్శించే పల్లెటూరి సోయగాలను వీలైనంత త్వరగా తెరపై చూడాలని ఆశపడుతున్నారు.
అనసూయ పాత్ర గురించి ప్రీ రిలీజ్ ఈవెంటులో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసిందని, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. మెగాస్టార్ ప్రశంసలు అనసూయకు మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.
కాగా, 'రంగస్థలం' సినిమాను మార్చి 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్టవ్వడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది.


Click it and Unblock the Notifications