»   » మీకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ విరుచుకు పడ్డ అనసూయ

మీకు దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ విరుచుకు పడ్డ అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రీసెంట్ గా సాయిధరం తేజ్ మూవీ విన్నర్ లోని కొన్ని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్ కి మంచి రియాక్షన్ వస్తోంది. అయితే వీటిలో అనసూయ నటించిన ఐటెం సాంగ్ కూడా ఉంది. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్ గా ఉన్నా.. కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు.

  దశావతారాలలో ఒకడైన బుద్దుడి విగ్రహాన్ని ముందు పెట్టుకొని అలా అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం ఏమిటీ అంటూ విమర్శలు మొదలు పెట్టారు..కాసేపు వీళ్ల మాటలని భరించిన అనసూయ వీళ్లందరికీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. అసలే ఎంత కూల్ గా కనిపిస్తుందో తిక్క రేగితే అంత కోపంగానూ మారిపోయే అనసూయ

  Anasuya's Fitting Reply about Item Song In front Of Buddha

  "ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ లోని "బుద్ధబార్" అనే పేరు గల ఓ పబ్ లో చిత్రీకరించాం. అక్కడ అప్పటికే బుద్ధుడి విగ్రహం ఉంటుంది. మేమేదీ ఆ విగ్రహం ఏర్పాటు చేయలేదు. గూగుల్ కి వెళ్లి బుద్ధ బార్స్ గురించి ఎంక్వైరీ చేసుకుంటే.. ఈ బుద్ధ బార్స్ చెయిన్ గ్రూప్ గురించి తెలుస్తుంది' అంటూ క్లాస్ తీసుకుని క్లారిఫై సదరు సాంప్రదాయ వాదుల కళ్ళు తెరిపించింది.. ఇక అంత చెప్పిన తర్వాత ఇంకా సైలెంట్ గా ఉండటం ఎందుకనుకుదో ఏమో గానీ... ఆ తర్వాత ఇంకాస్త డోస్ పెంచేసింది.

  'అయినా అక్కడ బుద్దున్ని పూజిస్తూ అక్కడే ఉండే వాళ్లకి బుద్ధుడి విగ్రహం ముందు పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసుకోవడానికి ఇబ్బంది లేనపుడు.. మేము పాట తీస్తే తప్పేంటట? మా ఉద్దేశ్యం జనాలను ఎంటర్టెయిన్ చేయడమే' అన్న అనసూయ.. "ఇతరులను ముఖ్యంగా ఆర్టిస్టులను గౌరవించడం చేతకాని జనాలకు.. దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు" అంటూ ఫైనల్ కౌంటర్ సగట్టిగానే ఇచ్చింది.

  అసలు ఐటం సాంగ్ లే చేయనూ అంటూ మంగమ్మ శపథం చేసిన అనసూయ ఈ పాట చేయటానికి కారణం ఏమిటంటే మొదటగా తన పేరు మీదే పాట పెట్టడం అదే అనసూయను బాగా టచ్ చేసిందట. "సూయాసూయా అనసూయ" అనే పాట తెగ నచ్చేసిందట. రెండవది రెమ్యూనరేషన్......

  ఈ ఒక్క పాట కోసం అమ్మడికి ఏకంగా "25 లక్షల" రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారట. మాములుగా అది భారీ మొత్తం కాకపోయినా అనసూయకి నచ్చేయటం తో ఒప్పేసుకుంది. అందులోనూ ఇప్పుడు అనసూయ ఉన్న రేంజ్ కి ఒక్క పాటకి పాతికలక్షలు ఇవ్వటం అంటే చెప్పుకోదగ్గ విశేషమే. ఇక ఇంత నచ్చి చేసిన పాట గురించి ఎవరైనా అలా మాట్లాడితే ఊరుకుంటుందా మరి...

  English summary
  Some netizens on social media targeted the team of 'Winner' accusing it of filming an item song in front of 'Buddha' statue. Decided not to take this foolish criticism, Anasuya has now given a fitting reply to all those haters on social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more