రూ. 4 కోట్ల నగలతో యాంకర్ అనసూయ (ఫోటోస్)
హైదరాబాద్: ‘ఇప్పటికి 30 ఎపిసోడ్లు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. రేటింగ్ పరంగా కూడా ఈ ఫ్రోగ్రామ్ ఎంతో విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ‘మా మహాలక్ష్మి' మా టీవీ గేమ్ షోలో భాగంగా అనసూయ రూ. 4 కోట్ల రూపాయల విలువ చేసే నగలను ధరించనుంది.
ఈ నగలను ఎంతో సెక్యూరిటీతో ‘కీర్తిలాల్ జ్యుయలర్స్' వారు కర్టసిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అనసూయ అనేక రకాలైన డ్రస్సులతో ప్రేక్షకులకు కనువిందు చేయనుందని చెప్పారు ‘మా మహాలక్ష్మి' డైరెక్టర్ అనిల్ కడియాల. ఈ నవరాత్రి సందర్భంగా పలువురు మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. అదే విధంగా విజయవాడ, గుంటూరు తదితర పట్టణాలలో నిర్వహించిన ‘మా మహాలక్ష్మి' ఎంట్రన్స్ పోటీలో ఎన్నో వేల మంది మహాలక్ష్ములు పాల్గొన్నారు.
ఇంకా ఈ షోలో రేలంగి గారి మనవడు లడ్డూ బాబు కూడా మహిళలను, చిన్నారుల విపరీతంగా ఆకర్షిస్తున్నాడని ‘మా మహాలక్ష్మి' జ్ఞాచీర ఎంటర్టెన్మెంట్ నిర్మాత ప్రవీణ్ తెలిపారు.

యాంకర్ అనసూయ
మా టీవీలో ప్రసారం అవుతున్న ‘మా మహాలక్ష్మి' అనే కార్యక్రమానికి అనసూయ యాంకరింగ్ చేస్తోంది.

ఇతర యాంకర్లు
‘మా మహాలక్ష్మి' కార్యక్రమంలో పాల్గొన్న ఇతర యాంకర్లతో కలిసి అనసూయ.

డాన్స్
‘మా మహాలక్ష్మి' కార్యక్రమంలో కేవలం యాంకరింగ్ చేయడం మాత్రమే కాదు...డాన్స్ కూడా చేసి అలరిస్తోంది అనసూయ.

ర్యాంప్ వాక్...
ఈ కార్యక్రమంలో అనసూయతో పాటు ఇతర యాంకర్లు హొయలు ఒలికిస్తూ అలరించారు.

అందం అదిరింది
అనసూయ, ఇతర యాంకర్లు తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.

4 కోట్ల నగలు
అనసూయ ఈ కార్యక్రమంలో రూ. 4 కోట్ల విలువ చేసే నగలను ధరిస్తోంది.


Click it and Unblock the Notifications











