సక్సెస్‌కు కామాలు మాత్రమే ఉంటాయి.. యాంకర్ అనసూయ కొత్త అవతారం!

ఓ టీవీ ఛానల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్‌గా తన సత్తా నిరూపించుకోవడంతో పాటు పలు టీవీ షోలు హోస్ట్‌గా సక్సెస్ అయ్యారు. కేవలం టీవీ రంగానికే తన అందం, టాలెంటును పరిమితం చేయకుండా సినిమా రంగంలోకి ఎంటరై వెండితెరపై సైతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సక్సెస్ అనే పదానికి పులిస్టాపులు ఉండవు, కామాలు మాత్రమే ఉంటాయి... అని 'మహర్షి' సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు అనసూయ కూడా తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

నిర్మాతగా మారనున్న అనసూయ

నిర్మాతగా మారనున్న అనసూయ

యారింగ్, టీవీ హోస్ట్, సినిమా నటిగా, హీరోయిన్‌గా మంచి పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న అనసూయ త్వరలో నిర్మాతగా మారుతున్నారు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా ప్రకటించారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్న ఆమె తన మనసులోని మాట బయట పెట్టారు.

కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మిస్తా

కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మిస్తా

భవిష్యత్తులో తనకు కంటెంట్ ఓరియెంట్ చిత్రాలు నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు అనసూయ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఏమైనా ప్రాజెక్టులు పైప్‌లైన్లో ఉన్నాయా? నిర్మాతగా సినిమా మొదలయ్యేది ఎప్పుడు? అనే విషయాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.

వెబ్ సిరీస్‌పై అనసూయ ఆసక్తి

వెబ్ సిరీస్‌పై అనసూయ ఆసక్తి

కేవలం సినిమాలు మాత్రమే కాదు... వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కూడా ఉందని ఈ చలాకీ యాంకర్ తెలిపారు. లీడ్ రోల్‌లో ఏదైనా మంచి కథ వస్తే వెబ్ సీరిస్ చేసేందుకు అనసూయ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న నేపథ్యంలో అనసూయ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

విడుదలకు సిద్ధంగా ఉన్న అనసూయ చిత్రాలు

విడుదలకు సిద్ధంగా ఉన్న అనసూయ చిత్రాలు

ప్రస్తుతం అనసూయ పలు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘కథనం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు సరిలేరు నీకెవ్వరు, ఆడ్రా మచ్చా అనే చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X