రాంచరణ్‌తో అనసూయ..: రంగస్థలం సెట్స్‌లో వీరిద్దరూ ఇలా!.. అద్భుతమట..
బుల్లితెరపై జబర్దస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ.. అనతికాలంలోనే వెండితెరకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఆకట్టుకునే అందం, తనదైన అభినయంతో సిల్వర్ స్క్రీన్‌పై కూడా మంచి మార్కులే కొట్టేశారు. ఏక కాలంలో అటు టీవీ షోలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
దర్శకుడు సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాలోనూ అనసూయ ఓ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి లీక్స్ ఇవ్వలేదు కానీ.. సీన్స్ మాత్రం అద్బుతంగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. తాజాగా రాంచరణ్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు అనసూయ.
అనసూయ సెల్ఫీ:
'రంగస్థలం సినిమాలో ఓ అద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత దిగిన సెల్ఫీ ఇది'.. అంటూ అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో రాంచరణ్ తో దిగిన ఫోటోను పోస్టు చేశారు. ఫోటోలో అనసూయ కుమారుడు కూడా ఉండటం విశేషం.

అద్భుతమైన వ్యక్తి:
'అద్భుతమైన వ్యక్తి రాంచరణ్‌తో దిగిన సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మీ రోజును మరింత ఆనందదాయకం చేయాలనుకుంటున్నా.. రంగస్థలం సెట్స్ లో దిగిన సెల్ఫీ ఇది, రాంచరణ్ మనల్ని గర్వపడేలా చేస్తారు' అని అనసూయ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.

అనసూయ పాత్ర?:
రంగస్థలంలో అనసూయ పాత్రపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోందంటూ తొలుత ప్రచారం జరిగినా.. అదంతా వట్టిదే అని తేలిపోయింది. ఆ తర్వాత మేనత్త పాత్రలో నటిస్తున్నారంటూ మరో ఊహాగానం కూడా తెర పైకి వచ్చింది. అయితే ఇందులో నిజానిజాలెంతనేది మాత్రం తెలియదు.

భారీ అంచనాలు:
సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. రాంచరణ్‌ను ఆయన డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసి ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా కథకు సంబంధించి పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టినప్పటికీ.. అసలు కథేంటి అన్నది మాత్రం ఇంతవరకు బయటకు పొక్కలేదు. బజ్ రీత్యా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











