యాంకర్ అనసూయ గురించి ఆ రూమర్ నిజమే, ఇదిగో సాక్ష్యం!
అనసూయ భరద్వాజ్... పేరుకు యాంకరే అయినా హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ. అందుకే ఆమెతో తమ సినిమాల్లో అతిథి పాత్ర లేదా స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శకులు మొగ్గుచూపుతుంటారు.
కొన్ని రోజులుగా అనసూయ గురించి ఓ రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్2'లో అనసూయ ప్రత్యేక గీతంలో నర్తించబోతోందంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
అది రూమర్ కాదు, నిజమే
అనసూయ తమ చిత్రం ‘ఎఫ్2'లో నటింస్తున్న విషయం నిజమే అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ‘ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్'లో అనసూయ అతిథి పాత్రతో పాటు ప్రత్యేక గీతంలో నటించబోతున్నట్లు తెలిపారు.
మీ వల్ల నా కోరిక తీరింది డైరెక్టర్ సర్
మీ వల్ల నా కోరికల్లో ఒకటి తీరినట్లయింది అంటూ అనసూయ రిప్లై ఇచ్చారు. ‘డైరెక్టర్ సర్ మీ సినిమాలో నన్ను తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీ వల్ల నా కోరికల లిస్టులో ఉన్న ఒకటి తీరినట్లయింది' అంటూ ట్వీట్ చేశారు.

ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్
వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్2' ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రమోషన్స్ షురూ
సినిమా విడుదలకు మరొక నెల రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. . డిసెంబర్ 12న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ఫంక్షన్ చేయబోతున్నాం. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











