టాలీవుడ్ సెక్స్ రాకెట్, ఇద్దరు టాప్ హీరోయిన్లు.. అనసూయకు ఫోన్, రేటు చెప్పిన శ్రీరెడ్డి!
అమెరికాలో చికాగోలో బయటపడ్డ టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. అరెస్టైన తెలుగు దంపతుల నుంచి అమెరికా పోలీసులు కూపీ లాగుతున్నారట. ఈవెంట్స్ పేరుతో టాలీవుడ్ హీరోయిన్స్ ని అమెరికాకు రప్పించి వారిచేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తవ్వే కొద్దీ ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది కిషన్ మోదుగుముడి, అతడి సతీమణి చంద్ర టాలీవుడ్ హీరోయిన్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. డాలర్ల ఎర చూపి వారిని ముగ్గులోకి దించుతున్నారు. తమని కూడా వారి ట్రాప్ లో దించడానికి ఆ దంపతులిద్దరూ ప్రయత్నించారని ప్రముఖ యాంకర్ అనసూయ, సంచలన నటి శ్రీరెడ్డి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video


ఇద్దరు టాప్ హీరోయిన్స్
చికాగోలో బట్టబయలైన సెక్స్ రాకెట్ లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి పేర్లని మాత్రం బయటకు వెల్లడించడం లేదు. తెలుగు తమిళ చిత్రాలతో వారిద్దరూ మంది గుర్తింపు పొందారని అంటున్నారు.

అరెస్టు చేసిన ఫెడరల్ ఏజెన్సీ
ఈ వ్యభిచార కూపం నిర్వహిస్తున్న తెలుగు దంపతులని ఫెడరల్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాత్కాలిక వీసా
అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే ఈవెంట్స్ పేరుతో టాలీవుడ్ హీరోయిన్లని రప్పించడం, గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయించడం.. ఇదే కిషన్, చంద్ర పని అని అంటున్నారు.

టార్గెట్ వాళ్లే
పెద్దగా అవకాశాలు లేని హీరోయిన్లే వాళ్ళ టార్గెట్. కుదిరితే స్టార్ హీరోయిన్స్ ని కూడా ముగ్గులోకి దించుతారు. అధికమొత్తంలో రేటు మాట్లాడి వారిచే వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది.

అనసూయకు ఫోన్
ప్రముఖ యాంకర్ అనసూయ కూడా చికాగో సెక్స్ రాకెట్ పై స్పందించింది. ఆ దంపతులిద్దరూ నన్ను కూడా సంప్రదించారని అనసూయ చెబుతోంది. కానీ వారి ట్రాప్ లో తాను పడలేదని అనసూయ తెలిపింది. 2014 లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్ళాను. ఆ తరువాత వెళ్ళలేదు. 2016 లో శ్రీరాజ్ అనే వ్యక్తి నుంచి అమెరికా నంబర్ తో ఫోన్ వచ్చింది అని అనసూయ తెలిపింది.

పద్ధతి నచ్చలేదు
అతడు ఫోన్ చేసి అమెరికాలో ఓ ఈవెంట్ కు హాజరు కావాలని కోరాడు. కానీ అతడు మాట్లాడే పద్ధతి నచ్చక పోవడంతో కుదరదని చెప్పినట్లు అనసూయ తెలిపింది. పోస్టర్ లో నా ఫోటో వేయడంతో ట్విట్టర్ లో ఖండించినట్లు అనసూయ తెలిపింది.

శ్రీరెడ్డి స్పందన
ఆ దంపతులు నన్ను కూడా సంప్రదించినట్లు శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వారికీ హైదరాబాద్ లో కూడా కోఆర్డినేటర్లు ఉన్నారు. వారు హీరోయిన్లని సంప్రదిస్తుంటారు. ఈవెంట్స్ పేరుతో అమెరికాకు తీసుకుని వెళ్లి వ్యభిచారం చేయిస్తారు. హీరోయిన్ ఫేమ్ ని బట్టి 1000 డాలర్స్ నుంచి 10000 డాలర్స్ వరకు ఆఫర్ చేస్తారని శ్రీరెడ్డి తెలిపింది.

మా అసోసియేషన్ సమావేశం
సంచలనం సృష్టిస్తున్న సెక్స్ రాకెట్ గురించి, ఈవెంట్స్ పేరుతో విదేశాలకు వెళ్లే నటీమణుల గురించి చర్చించేందుకు మా అసోసియేషన్ ఈ నెల 24 న సమావేశం కానున్నట్లు మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు.

ఇప్పటికే హెచ్చరించాం
విదేశాలకు వెళ్లే హీరోయిన్లని ఈ విషయంలో పలు మార్లు హెచ్చరించినట్లు శివాజీ రాజా పేర్కొన్నారు,. ఇకపై విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు వారి వివరాలు, ఈవెంట్ వివరాలు తమకు అందజేయాలని కోరారు. ఈవెంట్ నిర్వహించేవారితో మాట్లాడి దృవీకరిస్తామని శివాజీ రాజా తెలిపారు.


Click it and Unblock the Notifications











