ఇది నాగబాబు టైం.. ఎక్స్‌పోజింగ్ కామెంట్స్‌పై అనసూయ!

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. సినిమా, రాజకీయ, సామజిక అంశాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.నాగబాబు తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ మహిళలు, హీరోయిన్ల డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్నవారికి కౌటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్లు ఎక్స్ ఫోజింగ్ చేసే డ్రెస్సులు వేసుకుంటేనే అవకాశాలు వస్తాయా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు చేసిన కామెంట్స్ కు క్రమంగా మద్దత్తు పెరుగుతోంది.

మొన్న రష్మీ

మొన్న రష్మీ

నాగబాబు అమ్మాయిలు అందంగా డ్రెస్ వేసుకుంటే తప్పేంటి అంటూ మహిళలకు మద్దత్తు తెలుపుతూ కామెంట్స్ చేశారు. ఎస్ పి బాలసుబ్రమణ్యం లాంటి ప్రముఖులకు కౌంటర్ ఇస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాగబాబుకు మద్దతుగా పలువురు సెలెబ్రిటీలు నిలుస్తున్నారు. యాంకర్ రష్మీ మహిళలని సపోర్ట్ చేస్తో కామెంట్స్ చేసినందుకు నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మరో యాంకర్ అనసూయ కూడా నాగబాబు కామెంట్స్ పట్ల స్పందించింది.

ఇది నాగబాబు టైం

ఇది నాగబాబు టైం

అనసూయ నాగబాబు మాట్లాడిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఇది నాగబాబు టైం.. మిమ్మల్ని గౌరవిస్తున్నాను సర్ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతకు ముందు ఎస్ ఫై బాల సుబ్రహ్మణ్యం హీరోయిన్లని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. మహిళలకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో డిక్టేట్ చేయడానికి మీరు ఎవరు అని నాగబాబు ప్రశ్నించారు. మహిళలు అలాంటి డ్రెస్ వేసుకోవడం వలనే అత్యాచారాలు జరుగుతున్నాయనే వాదనని నాగబాబు ఖండించారు. సాంప్రదాయ బద్దంగా డ్రెస్ వేసుకున్నవారిపై కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు గుర్తు చేశారు.

మగవాళ్ల ఆలోచనల వల్లే

మగవాళ్ల ఆలోచనల వల్లే

మగవాళ్ల చెడు ఆలోచనల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏ మహిళ కూడా ఒక మగాడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పదు. అలాంటప్పుడు మహిళల డ్రెస్ విషయంలో మనం ఎందుకు రూల్స్ పెట్టాలని నాగబాబు ప్రశ్నించారు. బూజు పట్టిన ఆలోచనల నుంచి ఇకనైనా బయటపడాలని పేర్కొన్నారు.

హాట్ టాపిక్‌గా నాగబాబు

హాట్ టాపిక్‌గా నాగబాబు

కేవలం సినిమాకు సంబందించిన వ్యాఖ్యలే కాదు.. నాగబాబు రాజకీయ పరమైన అంశాల గురించి కూడా సెటైరికల్ గా స్పందిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు. ఆ మధ్యన బాలయ్యని ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X