తన టాటూ అర్థం, తొలి రెమ్యూనరేషన్ సీక్రెట్ బయటపెట్టిన అనసూయ!
Recommended Video

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న తెలుగు సెలబ్రిటీల్లో యాంకర్ అనసూయ ఒకరు. న్యూఇయర్ సందర్భంగా అనసూయ తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అనసూయను చూడగానే చాలా మందికి ఆమె వేయించుకున్న టాటూ వైపు దృష్టి వెళుతుంది. ఆమె ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారు? దాని అర్థం ఏమిటనే ప్రశ్నలు మైండ్‌లోకి వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికింది. తన ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటి? ఫస్ట్ సాలరీ ఎంత? ఇలా పలు అంశాలపై ఆమె స్పందించారు.

నేను చేస్తున్న పనిపై గర్వంగా ఉన్నా
ఓ అభిమాని తన వృత్తిపై నెగెటివ్ కామెంట్స్ చేయడంతో.... అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. నేను చేస్తున్న పని విషయంలో గర్వంగా, సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.

టాటూ అర్థం అదే
మీరు వేయించుకున్న టాటూ అర్థం ఏమిటి? అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ.... ఆ టాటూ అర్థం ‘నిక్కూ', అది మా ఆయన పెట్ నేమ్ అని తెలిపారు.

యాక్టింగ్, యాంకరింగ్ కాకుండా
యాక్టింగ్, యాంకరింగ్ కాకుండా.... మీలో ఉన్న ఇతర టాలెంట్స్ ఏమిటి? అంటే బాగా పాటలు పాడతానని, వంట బాగా చేస్తానని అనసూయ చెప్పుకొచ్చారు.

ఫస్ట్ రెమ్యూనరేషన్
మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే ప్రశ్నకు అనసూయ రిప్లై ఇస్తూ...... రూ. 5,500 అని తెలిపారు.

‘యాత్ర’లో మీ క్యారెక్టర్ ఏమిటి?
వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర'లో మీ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను అనసూయ దాటవేశారు. ఆ విషయం నేను ఇప్పుడే చెప్పలేను. కానీ నా జీవితంలో గుర్తుండిపోయే పాత్ర అని తెలిపారు.


Click it and Unblock the Notifications











