హీటెక్కించబోతున్న యాంకర్ అనసూయ.. ఇద్దరు స్టార్ హీరోలతో!
యాంకర్ అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీ. ఇటీవల అనసూయ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ కు దూరమైందంటూ పుకార్లు వ్యాపించాయి. అనసూయ తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఊహాగానాలకు తెరదించింది. బుల్లితెరపై యాంకర్ గా, వెండి తెరపై నటిగా దూసుకుపోతోంది. అనసూయకు తన గ్లామర్ పెద్ద ప్లస్. ఇక రంగస్థలం చిత్రంలో రంగమత్తగా అద్భుత నటన కనబరిచింది. దీనితో అనసూయని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక, నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్న అనసూయ గురించి మరో క్రేజీ న్యూస్ వచ్చింది.

అనసూయ దూకుడు
సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అనసూయ నటించింది. ఇక ఐటెం సాంగ్స్ కి కూడా ఒకే చెబుతోంది. సాయిధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో అనసూయ ఐటెం పాటలో అలరించింది. కథనం అనే చిత్రంలో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోంది. బుల్లి తెరపై, వెండి తెరపై అనసూయ జోరు కొనసాగుతోంది. ఎఫ్2 చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేయబోతోందనేది లేటెస్ట్ న్యూస్.

ఇద్దరు స్టార్ హీరోల సరసన
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకుడు. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాస్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ మరో ప్రయత్నం చేబోతోంది. ఈ చిత్రంలో జానపద నేపథ్యంలో సాగే ఐటమ్ సాంగ్ కోసం అనసూయని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్, వెంకీ ఇద్దరి మధ్య అనసూయ స్టెప్పులేయబోతోంది. ఈ స్పెషల్ సాంగ్ కు అనసూయ ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇద్దరు హీరోయిన్లు
ఎఫ్2 చిత్రంలో వెంకటేష్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ సరసన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా అనసూయ స్పెషల్ సాంగ్ కు ఒకే చెప్పడంతో చిత్రానికి కావలసినంత గ్లామర్ తోడైంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకీ, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మధ్య సాంగ్ కామెడీ సన్నివేశాలు హైలైట్ గా నిలవనునట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా
ఎఫ్2 చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అనిల్ రావిపూడి పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. దీనితో వెంకీ, వరుణ్ ఎఫ్2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











