»   » అనసూయ యాక్సిడెంట్ : పూటుగా మద్యం సేవించాడు, కేసు ఎందుకు పెట్టలేదంటే?

అనసూయ యాక్సిడెంట్ : పూటుగా మద్యం సేవించాడు, కేసు ఎందుకు పెట్టలేదంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఇటీవల అనంతపూర్ లో యాక్సిడెంటుకు గురైన సంగతి తెలిసిందే. ఈవిషయం తెలియగానే ఆమె అభిమానులు కంగారు పడ్డారు. అయితే అదృష్ట వశాత్తు అనసూయతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు.

తనకు ఏమయిందో అని కంగారు పడుతున్న అభిమానులకు అనసూయ సోషల్ మీడియా ద్వారా సందేశం ఇచ్చారు. తనకు బాగానే ఉందని, అదృష్ట వశాత్తు తనతో పాటు తన కుటుంబ సభ్యులు బ్రతికి బయట పడ్డారని... ఇది తనకు పునర్జన్మ లాంటిదని ఆమె తెలిపారు.

కార్లో ఎవరెవరు?

కార్లో ఎవరెవరు?

యాక్సిడెంట్ సమయంలో తనతో పాటు తన భర్త, ఇద్దరు పిల్లలు, తన సిస్టర్ ఉన్నట్లు అనసూయ వెల్లడించారు. తాము ప్రయాణిస్తున్నది ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ పెద్ద వెహికిల్ కావడం, ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంలో అంతా క్షేమంగా బయటపడ్డామని అనసూయ తెలిపారు.

అయ్యో పాపం నా కారు...

అయ్యో పాపం నా కారు...

తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆడి కారు ఆసుపత్రికి వెళ్లిందని, అది డిశ్చార్జ్ కావడానికి నెలరోజుల సమయం పడుతుందని, అనంతపూర్ వద్ద యాక్సిడెంట్ జరుగడం వల్ల దగ్గర్లోని బెంగుళూరు షోరూమ్ లో చేర్పించామని అనసూయ బాధ పడుతూ చెప్పింది.

ఇదో లెస్సన్, అందరూ పెట్టుకోండి

ఇదో లెస్సన్, అందరూ పెట్టుకోండి

యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను తప్ప అందరూ సీటు బెల్టు పెట్టుకున్నారు. రోడ్డంతా ఖాళీగా ఉంది, కాస్త పట్టేసినట్లు ఉందని యాక్సిడెంట్ జరిగే కొద్ది సమయానికి ముందే సీటు బెల్టు తీసేసాను. అందుకే నా తలకు చిన్న గాయమైంది. ఎవరైనా సరే యాక్సిడెంట్ సమయంలో సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోండి అని అనసూయ సూచించారు.

తాగి డ్రైవ్ చేయడం వల్లే..

తాగి డ్రైవ్ చేయడం వల్లే..

మరో కారులో వస్తున్న వ్యక్తి అధిక వేగంగతో తమను కారుకు అడ్డు రావడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని, దాని నుండి తప్పించుకునే క్రమంలో తమ కారు డివైడర్ ను ఢీ కొట్టిందని, ఆ కారును డ్రైవ్ చేసే వ్యక్తి బాగా తాగి ఉండటం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని, బెంగుళూరు నుండి అతడు తాగి కారు డ్రైవర్ చేసుకుంటూ వస్తున్నాడని అనసూయ తెలిపారు. అయితే అతడి వివరాలను అనసూయ వెల్లడించలేదు.

అందుకే కేసు పెట్టలేదు

అందుకే కేసు పెట్టలేదు

ఈ యాక్సిడెంటుకు కారణమైన, తాగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వెల్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి చెందిన వాడు. ఈ ప్రమాదంతో వాళ్ల నాన్న చాలా బాధ పడ్డాడు. కేసు పెడదామని అనుకున్నాం... వాళ్ల నాన్న డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నామని అనసూయ తెలిపారు.

నా పిల్లలతో ఉన్నా, చాలా కోపం వచ్చింది

నా పిల్లలతో ఉన్నా, చాలా కోపం వచ్చింది

మేము పెద్ద కారులో ఉన్నాం, ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి కాబట్టి బ్రతికాం. వేరే కారు అయితే మా పరిస్థితి ఎలా ఉండేదో. మా పిల్లలతో ఉన్నా.. ఈ యాక్సిడెంట్ అవగానే చాలా కోపం వచ్చింది. తాగున్న అతడిని పోలీస్ స్టేషన్ కు ఈడుద్దామనుకున్నాను. కానీ వాళ్ల నాన్న పరిస్థితి చూసి ఆగిపోయాం. ఆ స్థానంలో మేము ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించి లైట్ తీసుకున్నామని అనసూయ తెలిపారు.

ఇప్పటికైనా మారండి

ఇప్పటికైనా మారండి

ఇప్పటికైనా అందరూ మారండి, తాగి డ్రైవ్ చేయడం మానేయండి. సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోండి. మాకు యాక్సిడెంట్ కావడానికి కారణమైన వ్యక్తి లేదా వారి బంధువులు మా స్థానంలో మీరు ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి అనసూయ చెప్పుకొచ్చారు.

English summary
Anasuya met with an accident near Anantapur and she has survived with minor injuries. Popular Telugu TV anchor Anasuya Bharadwaj is a known person to everyone in Telugu film industry. Those who follow the Telugu TV industry very closely, everyone will know about Anasuya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu