చెర్రీ మూవీపై అనసూయ కామెంట్... నిజంగా ఆ రేంజిలో ఉంటుందా?

రంగస్థలం సినిమాపై అనసూయ హాట్ కామెంట్. చెర్రీకి ఇది మరో ‘స్వయంకృషి’ అవుతుందన్నారు.

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారనే సమాచారం తప్ప అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

'రంగస్థలం 1985' సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్న యాంకర్ అనసూయ ఇందులో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది? అని వివరించే ప్రయత్నం చేశారు. మెగా స్టార్ చిరంజీవికి 'స్వయం కృషి' సినిమా ఎలాగో.... రామ్ చరణ్‌కు 'రంగస్థలం 1985' ఆ రేంజి సినిమా అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

స్వయం కృషి

స్వయం కృషి

చిరంజీవి, విజయశాంతి జంటగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వయం కృషి' సినిమా 1986లో విడుదలైంది. చిరంజీవి చేసిన ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి చిత్రంతో అనసూయ....రామ్ చరణ్ ‘రంగస్థలం 1985' సినిమాను పోల్చడం గమనార్హం.

చాలా దగ్గరగా చూశాను

చాలా దగ్గరగా చూశాను

నాకు ఇప్పటి వరకు రామ్ చరణ్ ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఈ సినిమా ద్వారా నటుడిగా అతడిని చాలా దగ్గరనుండి చూస్తున్నాను. ఈ సినిమాను హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తున్నాడు. అతడి కమిట్మెంట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది అని అనసూయ చెప్పుకొచ్చారు.

మెగా ఫ్యాన్స్

మెగా ఫ్యాన్స్

‘రంగస్థలం' సినిమా యూనిట్ కూడా ఇవ్వని ఆసక్తికర సమాచారం...... అనసూయ ఎప్పటికప్పుడు ఇస్తుండటంతో చాలా మెగా ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ న్యూ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

అనసూయ రోల్

అనసూయ రోల్

ఇప్పటి వరకు అనసూయ రెండు మూడు సినిమాలు చేసింది. అందులో ‘క్షణం' సినిమాలో తప్ప మిగతా అన్నింటిలో చిన్న పాత్రలో. కొన్ని చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. ‘రంగస్థలం' సినిమాలో అనసూయ రోల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X