పుష్ప సినిమాకు అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువగా..

టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ నటనతో కూడా తన స్థాయిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండే సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. రంగస్థలం సినిమాతో ఆమె స్థాయి ఒక్కసారిగా మారిపోయింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అనసూయా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాకు అనసూయ స్థాయిలో పారితోషికం అందుకుంది అనే విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

యాంకర్ గానే కాకుండా..

యాంకర్ గానే కాకుండా..

2003లో నాగా సినిమాలో ఒక పాటలో కనిపించి అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఇక కొన్నేళ్ల తర్వాత ఆమె సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. కేవలం యాంకర్ గానే కాకుండా గ్లామర్ పాత్రల్లో కూడా అనసూయ మెప్పిస్తూ వస్తుంది. జబర్దస్త్ షో ద్వారా అనసూయ ఎక్కువగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

అప్పట్లోనే అవకాశాలు

అప్పట్లోనే అవకాశాలు

ఒకవైపు సినిమాలు చేయడమే కాకుండా మరో వైపు టెలివిజన్ రంగంలో యాంకర్ గా కూడా బిజీ అవుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం అనసూయ రొటీన్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నా క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటోంది. అసలైతే ఆమెకి అప్పట్లో ఆర్య 2 సినిమాలో శ్రద్దా దాస్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది కానీ.. అప్పుడు పర్సనల్ రీజన్స్ వలన అనసూయ నటించడానికి ఒప్పుకోలేదు.

 నెగటివ్ రోల్స్ కూడా

నెగటివ్ రోల్స్ కూడా

రంగస్థలం సినిమా అనసూయకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందించింది అనే చెప్పాలి. ఆ సినిమాలో రంగమ్మత్తగా ఆమె నటించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత అనసూయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అనే చెప్పాలి. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేసేందుకు ఒప్పుకుంది. అంతేకాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది.

పుష్ప రెమ్యునరేషన్ ఎంతంటే..

పుష్ప రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సునీల్ కు జోడీగా ఆమె నటించిన విధానం ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అయితే అనసూయ ఆ సినిమాకు లో చేసిన పాత్ర కోసం ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే అనసూయ ఒక రోజుకు 1.5 లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. వారానికి పైగా ఆమె షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

రెండవ భాగంలో..

రెండవ భాగంలో..

అనసూయ భరద్వాజ్ పుష్ప రెండవ భాగంలో కూడా దాక్షాయనిగా మరింత వైలెంట్ గా కనిపించనున్నట్లు సమాచారం. సునీల్ క్యారెక్టర్ కు సతీమణి గా అనసూయ పాత్ర రెండవ భాగంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అని దర్శకుడు సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే మలయాళం తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వస్తుండడంతో అనసూయ చాలా జాగ్రత్తగా తనకు సెట్టయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X