అల్లు అర్జున్ సినిమాలో యాంకర్ అనసూయ.. మరోసారి అదే తరహాలో..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యాంకర్స్ వరుసగా సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై విభిన్నమైన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా తన నటనతో సరికొత్తగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఓకే చేస్తోందట.
గతంలో ఎన్నో రకాల పాత్రలు చేసిన అనసూయ భరద్వాజ్ ఎక్కువగా క్రేజ్ అందుకుంది మాత్రమే రంగస్థలం సినిమాతోనే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ పాత్రతో అమ్మడికి రంగమ్మత్త అనే బ్రాండ్ గట్టిగా పడింది. ఇక మరోసారి అదే తరహాలో మరో పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి రామ్ చరణ్ సినిమాలో కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా మరేదో కాదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలోనే రంగమ్మత్త సరికొత్త టాలెంట్ తో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ సినిమాతో అనసూయ తన క్రేజ్ ను ఇంకా ఏ స్థాయిలో పెంచుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











