»   » యాంకర్ అనసూయ బర్త్ డే...హాట్ లుక్ (ఫోటోలు)

యాంకర్ అనసూయ బర్త్ డే...హాట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ. బుల్లితెర ప్రపంచంలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన యాంకర్. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

చిలిపి చేష్టలు, ముద్దొచ్చే హావభావాలు, ఆకట్టుకునే యాంకరింగ్ స్కిల్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ అనతి కాలంలోనే యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ నేడు పుట్టినరోజు జరుపుకుంది. ఇంట్లో తన భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.

కేక్ కట్ చేస్తున్న ఫోటోలో అనసూయ హాట్ హాట్ లుక్‌తో దర్శనమివ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కేకట్ కట్ చేస్తున్నఅనసూయ

కేకట్ కట్ చేస్తున్నఅనసూయ

ఇంట్లో తన భర్తతో కలిసి కేక్ కట్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న యాంకర్ అనసూయ.

అనసూయ

అనసూయ

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

ఫాలోయింగ్

ఫాలోయింగ్

అనసూయ కంటే సీనియర్ యాంకర్ల సుమ, ఝాన్సీ, శిల్పా శెట్టి తదితరులు కూడా పలు సినిమా ఆడియో ఫంక్షన్లకు, టీవీ షోలకు యాంకరింగ్ చేసినా....అనసూయ మాదిరి ఫాలోయింగ్ సంపాదించుకోలేక పోయారు. సోషల్ నెట్వర్కింగులో అనసూయను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య వేలల్లో ఉంది.

హాట్ హాట్ యాంకరింగ్

హాట్ హాట్ యాంకరింగ్

అనసూయ ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ గుర్తింపు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి కారణం........ఏమిటా అనే విషయాలను ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. యాంకరింగులో అనసూయ టాలెంటు, ఆకట్టుకునే మాటతీరుతో పాటు, హాట్ ఫోటోలు, సెక్సీ ఆటిట్యూడ్ కూడా ఇంత ఫాలోయింగ్ పెరగడానికి ప్రధాన కారణం అని పలువురి అభిప్రాయం.

English summary
Anchor Anasuya celebrates her birthday today at home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu