»   » ఖరీదైన కారు కొని అందరికీ షాకిచ్చిన....యాంకర్ అనసూయ!

ఖరీదైన కారు కొని అందరికీ షాకిచ్చిన....యాంకర్ అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ... ఈ మధ్య కాలంలో తెలుగు టెలివిజన్ రంగంలో బాగా పాపులర్ అయిన యాంకర్. బుల్లితెరపై మంచి గుర్తింపు రావడంతో అమ్మడుకి సినిమాల్లోనూ అవకాశాలు రావడం మొదలయ్యాయి. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీలో రొమాంటిక్ రోల్ చేసిన అనసూయ, క్షణం చిత్రంలో కీలకమైన పాత్ర చేసింది.

అటు టెలివిజన్ రంగంలో, ఇటు సినిమా రంగంలో రాణిస్తున్న అనసూయ... సంపాదన కూడా బాగానే పెరిగింది. తాజా ఆమె దాదాపు రూ. కోటి విలువ చేసే 'ఆడి క్యూ 7' మోడల్ బ్లూకలర్ లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనసూయ కారు కొన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Also Read: నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

సాధారణంగా కోటి విలువ చేసే కార్లు.... మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు వద్ద మాత్రమే ఉన్నాయి. ఇపుడు అనసూయ కూడా ఆ రేంజి ఖరీదైన కారులో తిరుగుతుండటం హాట్ టాపిక్ అయింది. సాధారణ వ్యక్తులయినా సినిమా, టీవీ రంగంలో క్లిక్ అయితే సంపాదన ఏ రేంజిలో ఉంటుందో చెప్పడానికి అనసూయను ఒక ఉదాహరణ.స

Also Read: ఇష్టం లేకున్నా ఆయన కోసమే చేసా.... (అనసూయ ఇంటర్వ్యూ)

Anchor Anasuya buys Audi Q7

టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్‌ వంటి కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ బిజీగా కనిపించే అనసూయ, ఒక్కసారిగా సోగ్గాడే లో కనిపించి రెచ్చిపోయి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పీవీపీ సినిమా పతాకంపై తెరకెక్కించిన 'క్షణం' చిత్రంలో పోలీసు అధికారిణి పాత్రలో అదరకొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ వరస పెట్టి ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదని సమాచారం. తాజాగా ఆమె పీవీపి బ్యానర్ లోనే రూపొందనున్న మరో చిత్రం కమిటైందని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఇదొక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు, కథ ఫైనలైజ్ అయ్యాయని, ఈ మేరకు అనసూయకు ఓ భారీ మొత్తాన్నేఆఫర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ఇప్పుడిప్పుడే వెండితెరపై అడుగులు వేస్తోన్న అనసూయకు, ఎదిగేందుకు పివిపి వంటి స్టార్ బ్యానర్ తో ముందుకు వెళ్ళటం ఫెరఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు. రాబోయే సినిమాలో ఖచ్చితంగా మిగతా హీరోయిన్లకు తీసుపోని రీతిలో ఆమె దుమ్ముదులపనుందని అంటున్నారు.

English summary
Film Nagar source said that, Anasuya bought a blue color Audi Q7 costing a whooping Rs. 1 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu