వెడ్డింగ్ యానివర్సరీ: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ...
యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం పర్యాటకుల స్వర్గధామం మాల్దీవుల్లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ బీచ్ ఒడ్డున్న సేద తీరుతున్న ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. జూన్ 4న అనసూయ పెళ్లి రోజు, ఈ ఏడాది వెడ్డింగ్ యానివర్సరీని మరింత ఆనందంగా జరుపుకునేందుకు భర్త సుశాంత్ భరద్వాజ్‌తో కలిసి మాల్దీవుల్లో వాలిపోయారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Recommended Video

మాల్దీవుల్లో భర్తతో అనసూయ
తన ఇష్టమైన ప్రదేశాల్లో మాల్దీవులు ఒకటని, ఈ అందమైన ప్రదేశానికి తీసుకొచ్చిన తన భర్త ఎంతగానో ఆనందపెట్టారని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించారు.

అన్యోన్య దాంపత్యం
అనసూయ జనవరి 23,1985 లో జన్మించారు. హైదరాబాద్‌లో భద్రుకా కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. సుశాంత్ భరధ్వాజ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

భర్త ప్రోత్సాహంతో కెరీర్లో పైపైకి
భర్త ప్రోత్సాహం ఉండటంతో అనసూయ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇపుడు టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా హవా కొనసాగిస్తున్నారు. సాక్షి టీవీలో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్‌గా వచ్చిన తర్వాత అనసూయ దశ తిరిగింది.

సినిమాల్లోనూ బిజీ బిజీ
2003లో తొలిసారి అనసూయ ‘నాగ' చిత్రంలో లా స్టూడెంట్ పాత్రలో చిన్న పాతల్రో నటించారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం, గాయిత్రి సినిమాలతో నటించారు. ఇటీవల వచ్చిన ‘రంగస్థలం'లో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు, టీవీ షోలతో అనసూయ బిజీ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











