యాంకర్ అనసూయ ఎందుకలా ప్రవర్తిస్తోంది?(ఫోటోలు)
హైదరాబాద్: యాంకర్ అనసూయ. బుల్లితెర ప్రపంచంలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన యాంకర్. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.
అనసూయ కంటే సీనియర్ యాంకర్ల సుమ, ఝాన్సీ, శిల్పా శెట్టి తదితరులు కూడా పలు సినిమా ఆడియో ఫంక్షన్లకు, టీవీ షోలకు యాంకరింగ్ చేసినా....అనసూయ మాదిరి ఫాలోయింగ్ సంపాదించుకోలేక పోయారు. సోషల్ నెట్వర్కింగులో అనసూయను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య వేలల్లో ఉంది.
అనసూయ ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ గుర్తింపు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి కారణం........ఏమిటా అనే విషయాలను ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. యాంకరింగులో అనసూయ టాలెంటు, ఆకట్టుకునే మాటతీరుతో పాటు, హాట్ ఫోటోలు, సెక్సీ చేష్టలు కూడా ఇంత ఫాలోయింగ్ పెరగడానికి ప్రధాన కారణం అని పలువురి అభిప్రాయం.

హీరోయిన్ కావాలనే లక్ష్యమా?
అనసూయ తరచూ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.....అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం వెనక భవిష్యత్‌లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

సీనియర్ల బాటలో...
ఇప్పటికే కలర్స్ స్వాతి, ఉదయ భానుతో సహా పలువురు యాంకర్లు బుల్లితెరపై తమ టాలెంటు నిరూపించకుని హీరోయిన్లుగా మారారు. ఆ బాటలోనే అనసూయ నడుస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

అనసూయపై గాసిప్స్
సెలబ్రిటీగా మారిపోయిన అనసూయపై ఈ మధ్య పలు గాసిప్స్ కూడా ప్రచారం జరిగాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె ఐటం సాంగుకును తిరస్కరించినట్లు చర్చించుకున్నారు.

అనసూయపై విమర్శలు
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాన్ని వదులు కోవడంతో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. కొందరు అభిమానులు సోషల్ నెట్వర్కింగులో విసిగించారు కూడా.

ఘాటుగా సమాధానం ఇచ్చిన అనసూయ
అత్తారింటికి దారేది సినిమా రిలీజయ్యాక తాను ఎందుకు నిటించలేదో తన ఫ్యాన్స్‌కు అసలు కారణం వివరించే ప్రయత్నం చేసింది. అయితే దానికి కొంతమంది ఫ్యాన్స్ ట్వీట్స్ తో ఆమెను విసిగించారు. దాంతో ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది.


Click it and Unblock the Notifications











