twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు: రిపబ్లిక్ డే వేళ అనసూయ సంచలనం!

    By Bojja Kumar
    |

    తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో టాప్ పొజిషన్లో కొనసాగుతూ, అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకెళుతున్న యాంకర్ అనసూయ రిపబ్లిక్ డే విషెష్ చెబుతూ సంచలన ట్వీట్ చేసింది. ఈ సమాజంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, తనతో పాటు తన ఫ్యామిలీ ఎదుర్కొంటున్న వేధింపులను వెల్లడించే ప్రయత్నం చేసింది. డియర్ ఇండియా అంటూ.... ఈ దేశంలో, సమాజంలో ఇంకా మారని పరిస్థితులపై గళమెత్తారు.

    నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను

    నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను

    ‘డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను... అని అనసూయ తెలిపారు.

    నేను చేసే పని, ధరించే దుస్తులపై.....

    నేను చేసే పని, ధరించే దుస్తులపై.....

    నేను చేసే పని, నేను ధరించే దుస్తుల వల్ల నా కుటుంబం ఇబ్బంది గా ఫీలవ్వడం లేదు. ఇవి వారిపై ఎలాంటి ప్రభావం చూడం లేదు. కానీ బయటి వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు అంటూ తన సమస్యను ఏకరువు పెట్టే ప్రయత్నం చేసింది అనసూయ.

    నన్ను, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు

    నన్ను, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు

    మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నాతో పాటు నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు, అమర్యాదగా, అగౌరవంగా వ్యాఖ్య చేస్తూ మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు అని అనసూయ తెలిపారు.

    ఫోన్లు చేస్తూ, కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారు

    ఫోన్లు చేస్తూ, కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారు

    ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ నన్ను వేధిస్తున్నారు. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు..... అంటూ అనసూయ వాపోయారు.

    బాధ్యతగల మహిళగా ప్రశ్నిస్తున్నాను

    బాధ్యతగల మహిళగా ప్రశ్నిస్తున్నాను

    బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.స్వేచ్ఛకు అర్థం ఇదేనా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? అంటూ... అనసూయ మండి పడ్డారు.

    సంస్కృతీసంప్రదాయాల పేరిట..

    సంస్కృతీసంప్రదాయాల పేరిట..

    సంస్కృతీసంప్రదాయాల పేరిట నా భావాలను, గౌరవాన్ని అణగదొక్కే స్వేచ్ఛ ఈ అవివేకులకు ఉందా? నేను ఇలాగే జీవించాలా? ? ఏమీ చేయలేమా??' అంటూ అనసూయ తన మనసులోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

    అనసూయ ట్వీట్

    అనసూయ చేసిన ట్వీట్ ఇదే.

    English summary
    Questioning the definition of freedom in the wake of 'abuse, disrespect, dishonour' she is receiving from people, anchor-turned-actor Anasuya Bharadwaj took to social media and sent out a powerful message to the nation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X