వరల్డ్‌లోనే అతి పెద్దదైన దాంట్లో అనసూయ రచ్చ.. వాళ్లతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోందిగా!
అనసూయ.. అమెరికా అంటే అనకాపల్లికి వెళ్లినంత ఈజీగా వెళ్లి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె ఆ దేశంలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తోంది. మరి ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు కానీ.. తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేసింది. ఈ సారి ప్రపంచంలోనే అతి పెద్దదైనా ఆ ప్లేస్ లోకి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసింది. వారితో కలిసి పబ్లిక్ లోనే రచ్చ రచ్చ చేసింది. చూస్తే అవాక్కవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే...
ఏమైనా తగ్గేదే లే... :యాక్టర్ కమ్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షోతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సిల్వర్ స్క్రీన్ పై ఏమాత్రం తగ్గట్లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంటోంది. పాత్ర ఏదైనా సరే, ఫొటోషూట్ ఎలాంటిది అయినా సరే.. అస్సలు తగ్గట్లేదు. చీరు కట్టినా, బికినీ వేసినా ఒంపుసొంపులు చూపిస్తూ తన విలక్షణ యాక్టింగ్ తో అదరగొట్టేస్తోంది.

ఆ రెండు పాత్రలతో ప్రత్యేక గుర్తింపు.. :అలా ఇప్పటికే తన అంద చందాలతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామకు సినిమా ఛాన్స్ లు వరుసగా క్యూ కట్టాయి. అలానే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో మరోసారి 'పుష్ప' దాక్షయినీగా అలరించింది. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గా.. :సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తుంటుంది. అలాగే వివాదస్పద ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అమెరికాకు పలు సార్లు వెళ్లి వచ్చింది. అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. పబ్లిక్ రోడ్స్ పై గ్లామర్ షో చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. మోడ్రన్ ఔట్ ఫిట్లలో నాభి అందాలను, ఎద అందాలను చూపిస్తూ అలరిస్తోందని నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైనా... :తాజాగా ఓ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె న్యూజెర్సీలో ఉన్న.. ప్రపంచంలోనే అతి పెద్దదైనా ఇండోర్ గో కార్టింగ్ లో ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఆమె తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. కారు రేసింగ్ కూడా చేసింది. అక్కడి వారితో కలిసి కెమెరాలకు మస్త్ మస్త్ పోజులిచ్చింది. అంతకుముందు ఓ కొత్త ఫొటోషూట్ పోస్ట్ చేసి రచ్చ చేసింది. అక్కడి రోడ్లపైనే హాట్ ఫొటోలకు పోజులిస్తూ ఎంజాయ్ చేసింది. ఇవి చూసిన కొందరు నెటిజన్లు.. 'చాలా సెక్సీగా ఉంది'.. 'ఫుల్ హాట్ గా ఉంది'.. 'తొడలు కనిపించేలా నిక్కర్లు.. నాభి కనిపించేలా ఆ టాప్ ఏంది' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. :రీసెంట్ గా విడుదలైన 'విమానం' సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఇందులో సుమతి అనే వేశ్యగా నటించి ఆకట్టుకుంది. ఆమెది చిన్న పాత్రే అయినా.. గ్లామర్ షోతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేసి ఫిదా చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2'తో పాటు ఫ్లాష్ బ్యాక్ అనే సినిమా చేస్తోంది. అలాగే మరిన్ని కథలు వింటూ చిత్రాలు చేసేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











