For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ అనసూయ ఇదిగో ఇలా హోలీని...(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తొలి రోజు నుంచి యాంకర్ అనసూయకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఆమె చేసిన జబర్దస్త్ పోగ్రాం సూపర్ హిట్టవటం తో మరింత ముందుకు దూసుకుపోయింది. ఆమెకు ఫామ్ లో ఉన్న సినిమా హీరోయిన్స్ తో సమానంగానో..ఇంకొంచెం ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని మరింత పెంచుకోవటానికి ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని తన ఫ్యాన్స్ కు తెలియచేస్తేనే ఉంది. తాజాగా ఆమె ఇదిగో ఇలా తన కుటుంబంతో కలిసి హోలి పండుగ చేసుకుంది. ఈ విషయాన్ని ఇలా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దాంతో ఆమె తన అభిమానులను అలరించటానికి ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అప్ లోడ్ చేస్తూ తనని తాను అప్ డేట్ చేస్తూ ఫ్యాన్స్ కు పండుగ చేస్తోంది. తెలుగులో ఉన్న యాంకర్ లలో హాట్ గా కనపడి వెంటనే ఆకట్టుకునే వారు ఎవరంటే కళ్ళు మూసుకుని అనసూయ పేరే చెప్తారు. పెళ్ళై బిడ్డల తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్ తో తన మ్యాజికల్ నవ్వుతో బుల్లి తెర ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

  Anchor Anasuya spreads colours of Love

  న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే విషయమై కామెంట్స్ చేసి మరీ అందరి దృష్టిలో మరోసారి పడింది. సినిమావాళ్లను సైతం ఆమె ఆకర్షించినా ఆచి,తూచి తన బుల్లి తెరకెరీర్ పై ముందుకు వెళ్తోంది.

  గతంలో ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది.

  ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

  చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. అవే ఆమె ఎస్సెట్స్ గా ముందుకు వెళ్తోంది. అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి.

  మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు.

  అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది. పొట్టి డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

  మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ. ఈ టీవీ లో ప్రసారమయ్యే... జబర్దస్త్ అనే కామెడీ రియాలటీ షో ద్వారా ఆమె పాపులారిటి తెచ్చుకుంది. అయితే తర్వాత ఆమెని తొలిగించి,రేష్మిని పెట్టుకున్నారు. ఇప్పుడూ ఇద్దరూ కలిసి ఓ పోగ్రాం చేస్తున్నారు.

  English summary
  Anasuya took to her twitter page to post the pictures from the family holi celebrations and she tweets saying, "Bura na maano HOLI haiiiiii!! Happy Holiiiiii !! Tym for sum bhaang!! Haffun al! (sic)."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X