twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్లిసిటీ కోసం హద్దులు దాటొద్దు, కొంతమంది కావాలనే.. మీటూపై అనసూయ మాట!

    |

    దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, నటీమణులు తనకు జరిగిన వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా తెలియజేస్తున్నారు. దీనితో బాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీటూ ఉద్యమం సెగ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు కూడా పాకింది. తాజగా యాంకర్ అనసూయ మీటూ ఉద్యమంపై తన స్పందన తెలియజేసింది.

    రాద్ధాంతం చేయవద్దు

    రాద్ధాంతం చేయవద్దు

    ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. కొన్నిరోజులు పెద్ద సెలెబ్రిటీలు మీటూ ఉద్యమం గురించి స్పందిస్తున్న తీరుని గమనిస్తున్నా. కొంతమంది తమకు ఎదురైన వేధింపులపై మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు అనిపించింది.

     పబ్లిసిటీ కోసం

    పబ్లిసిటీ కోసం

    నిజంగా వేధింపులు ఎదురైన వాళ్ళు మాత్రమే స్పందించండి. పబ్లిసిటీ కోసం దీనిని మరింత పెద్దదిగా చేయవద్దు అని అనసూయ సూచించింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయవద్దు అని అనసూయ తెలిపింది.

     ధృడంగా ఉండాలి

    ధృడంగా ఉండాలి

    లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు అనేక చోట్ల జరుగుతోంది. నటీమణులు ఇలాంటి వేధింపుల విషయంలో ధృడంగా ఉండాలని అనసూయ సూచించింది. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తప్పించుకునే చాకచక్యం తెలియాలి అని అనసూయ పేర్కొంది.

    బాలీవుడ్‌లో దుమారం

    బాలీవుడ్‌లో దుమారం

    తనుశ్రీ దత్తతో మొదలైన ప్రకంపనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కంగనా రనౌత్, స్వరభాస్కర్, దీపికా పదుకొనె, రవీనా టాండన్ వంటి హీరోయిన్లంతా మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలియజేస్తున్నారు.

    English summary
    Anchor Anasuya supports MeToo India campaign. Dont missue MeToo says Anasuya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X