Anasuya Bhardwaj: అనసూయ హృదయంపై నిక్కు... ఇంతకీ ఎవరబ్బా?
టీవీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. వార్తల్లో మాత్రం ఉంటుంది. ఈ మధ్య తనలో మార్పులు చాలా వచ్చాయంటూ ఓ వీడియో పోస్ట్ చేయగా.. ఈరోజు తన ఫోటోలు షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు గమనిస్తే.. తన హృదయంపై ఓ టాటూ ఉంది. అది నిక్కు అని తెలుస్తోంది. తన హృదయంపై ఆ స్థానం సంపాదించిన ఆ వ్యక్తి ఎవరు.. ఆ వివరాల్లోకి వెళ్దాం.
'జబర్దస్త్' షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. యాక్టింగ్ అండ్ యాంకరింగ్ స్కిల్స్ తో తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది అనసూయ. కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ రంగానికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పి... వెండితెరపై సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది అనసూయ.

సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న అనసూయ.. ఈ ఏడాది 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటే సౌత్ ఇండస్ట్రీలోని వేరే భాషల చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది. ఇక అనసూయ ఈ మధ్య తనలో మార్పులు వచ్చాయంటూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో వైరల్ అయింది.

అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోల్లో అనసూయ ఎద అందాలతో పాటు.. బ్యాక్ అందాలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్లీవ్ లెస్ టాప్ వేసుకుని, బ్లూ జిన్స్ లో అనసూయ ఫోటోలు చూస్తే.. ఎవరైనా వావ్ అనాల్సిందే.

ఇక ఈ ఫోటోలకు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ఈ ఉదయం మంచి వైబ్స్ అందిస్తోంది.. సోమవారం బ్లూ కాదు.. ఓన్లీ స్కై బ్లూ మాత్రమే. మీరందరూ మంచిగా ఉండండి.. అంటూ రాసుకొచ్చింది. ఇక నెటిజన్స్ దీనికి కొంత మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతుండగా.. కొంత మంది షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన బెడితే.. అనసూయ షేర్ చేసిన ఫోటోల్లో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఆమె ఎదపై ఓ టాటూ ఉంది. అది నిక్కు అని తెలుస్తోంది. అయితే ఎవరూ ఈ నిక్కు.. అనసూయ హృదయంపై వేసుకునే పేరా అంటూ.. గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ నిక్కు ఎవరో కాదట. ఆమె భర్త భరద్వాజ్ ఏ అని తెలుస్తోంది. ఆమె తన భర్త భరద్వాజ్ ను నిక్కు అని పిలుస్తుందని తెలుస్తోంది. భరద్వాజ్ ముద్దు పేరు నిక్కు అని.. గతంలో చెప్పుకొచ్చింది ఈ భామ. అదన్న మాట విషయం. ఓ సారి మీరు ఆఫోటోస్ చూడండి.


Click it and Unblock the Notifications











