యంగ్ హీరోతో అనసూయ ప్రేమాయణం?: అడిగితే ఏమందో తెలుసా!..
Recommended Video

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన అనసూయ.. రెండింటిని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఓ పక్క యాంకర్‌గా, మరోపక్క నటిగా దూసుకుపోతోంది. అందంతో, అభినయంతో తనకంటూ కొంతమంది అభిమానులను కూడా సంపాదించుకుంది.
అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో అభిమానులతో టచ్ లోకి వస్తుంది. తాజాగా మరోసారి అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన అనసూయ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

'పెళ్లి'.. ఎందుకని అంత త్వరగా చేసేసుకున్నారు?
చాలామంది ఇదే ప్రశ్న అడిగారు..(నవ్వుతూ..) అందరికీ నా సమాధానం ఒక్కటే. టైమ్ వస్తే కొన్ని అలా జరిగిపోతుంటాయంతే!..

'జబర్దస్త్' లాంటి అసభ్యకరమైన షోకు మీ మద్దతుపై?
మళ్లీ చెప్తున్నా. ‘జబర్దస్త్' కేవలం కామెడీ షో మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించి ఈ షో చేయడం. ఇలాంటి విషయాలు వ్యక్తిగతంగా తీసుకోకండి. మీ ఒత్తిడిని దూరం చేయడానికే ఈ షో చేస్తున్నాం.

రంగస్థలంలో చేస్తున్నారు కదా.. సమంత గురించి?:
సమంత యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. తనకు నేను అభిమానిని. ఇప్పుడు నేరుగా ఆమె నటన చూసే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నా.

తెలుగులో బాగా నచ్చిన సినిమాలు:
మురారి, అతడు, నేనొక్కడినే, మన్మధుడు, జులాయి..ఇలా చాలానే ఉన్నాయి.

రంగస్థలంలో 'అత్త' పాత్ర నిజమేనా?
నో.. ఇందులో ఏమాత్రం నిజం లేదు.

హీరోయిన్‌గా ఎంట్రీ ఎప్పుడు?
ఇదేం ప్రశ్న. ఇండస్ట్రీలో అందరూ అన్ని రకాల పాత్రలు చేస్తారు కదా..

విజయ్ దేవరకొండ గురించి?
అద్బుతమైన నటుడు..

ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నారని వార్తలు.. ఏమంటారు?
ఎక్కడినుంచి వస్తాయి ఇలాంటి వార్తలు?..(కోపంగా..)


Click it and Unblock the Notifications











