మా అమ్మకు ఇస్తానండీ, థాంక్యూ .. యాంకర్ ఇచ్చిన బహుమతితో ఎన్టీఆర్ ఎమోషనల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గురువారం అక్టోబర్ 11 న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే కనీవినీ ఎరుగని విధంగా అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి ఎన్టీఆర్ కు ఓ బహుమతి ఇచ్చింది.

హరికృష్ణ పెన్సిల్ ఆర్ట్

హరికృష్ణ పెన్సిల్ ఆర్ట్

గాయత్రీ భార్గవి ఎన్టీఆర్ కు హరికృష్ణ చిత్ర పటాన్ని బహుకరించింది. పెన్సిల్ ఆర్ట్ రూపములో రూపొందించిన హరికృష్ణ చిత్ర పటాన్ని ఎన్టీఆర్ కు ఇచ్చింది. గాయత్రి భార్గవి తాత 80 ఏళ్ల శంకర్ నారాయణ ఈ ఆర్ట్ వేశారట. ఈ విషయాన్ని గాయత్రి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

మా అమ్మకు ఇస్తానండీ

ఆ ఫోటో ఎన్టీఆర్ కు బహుకరించగానే ఆయన కళ్ళల్లో ఆనందం వర్ణించలేనిది అని గాయత్రీ భార్గవి తెలిపింది. తండ్రి చిత్ర పటాన్ని చూసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. మా అమ్మకు ఇస్తానండీ.. థాంక్యూ అని ఎన్టీఆర్ చెప్పినట్లు గాయత్రి భార్గవి తెలిపింది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ గా ప్రసంగించాడు. ఈవెంట్ జరిగినంతసేపు ఎన్టీఆర్ ఎమోషనల్ గానే కనిపించాడు. ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.

అరవింద సమేతపై అందరి దృష్టి

అరవింద సమేతపై అందరి దృష్టి

ఇదిలా ఉండగా గురువారం విడుదలవుతున్న అరవింద సమేత చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యాక్షన్ కథలో ఎన్టీఆర్ ఎలా నటించాడనే ఉత్కంఠ నెలకొని ఉంది. పూజ హెగ్డే ఏ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ చాలా కాలం తరువాత ఈ చిత్రంలో కమెడియన్ గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X