"8 ఏళ్లకే ఇండస్ట్రీలోకి.. ఎంతో మంది వాడుకుని మోసం చేశారు"
Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ ఈ పేరు తెలియని అలనాటి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం 8 ఏళ్ల వయసులో రేడియో ప్రపంచంలోకి అడుగు పెట్టి చిన్నారి ఆర్జేగా తన కెరియర్ ప్రారంభించింది. వివిధ టెలివిజన్లో తన మాటలతో మాయ చేసి వైవిధ్యమైన యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అనంతరం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. మరోవైపు ఒక మీడియా ఆక్టివేట్ గా ఎదిగింది. ఎన్నో కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఎదిరించి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది యాంకర్ ఝాన్సీ.
ఈరోజుల్లో పదులకొద్దీ చానళ్లు, డజన్ల కొద్ది యాంకర్లు. కానీ అప్పట్లో కేవలం రెండే రెండు చానళ్లు నలుగురు యాంకర్లు అన్నట్లుగా ఉండేది. బుల్లితెర హిట్ షోగా పేరు తెచ్చుకున్న 'టాక్ ఆఫ్ ది టౌన్' ప్రోగ్రాం కు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ. ఆ తరువాత 'సందడే సందడి', 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర','బ్లాక్', 'కో అంటే కోటి', 'నవీన', 'చేతన', 'స్టార్ మా పరివార్' ఇలా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర చిన్న స్క్రీన్ పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ.

అలాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించింది. ఎగిరే పావురమా అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించి ఇటీవల నారప్ప, వాల్తేరు వీరయ్య,ఎఫ్ 2, మల్లేశం వంటి ఎన్నో సినిమాలలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది యాంకర్ ఝాన్సీ. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తులసి సినిమాలో కోకాపేట కనకం అనే పాత్రలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నటించి నేటికీ గుర్తుండిపోయేలా చేసింది యాంకర్ ఝాన్సీ.
తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురొడ్డి ఈ స్థాయికి చేరుకుంది ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లోని ఎత్తుపల్లాలను వివరించింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే రేడియో యాంకర్ గా తన కెరీర్ను ప్రారంభించానని చెప్పుకొచ్చింది ఝాన్సీ. తాను పనిచేసిన ఆల్ ఇండియా రేడియోలో 180 రూపాయలను జీతం గా తీసుకున్నానని, ఆ డబ్బులతో తన నాన్న ఒక డిక్షనరీని గుర్తుగా కొనిచ్చారని అది నేటికీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో ఎంతోమంది తనకు చేదోడు వాదోడుగా నిలిచారని ఎన్నో విలువ కట్టలేని పాఠాలను నేర్పారని తెలిపారు యాంకర్ ఝాన్సీ.
తన 15 ఏండ్ల వయస్సులో యాడ్స్ లో నటించిన తెలిపారు యాంకర్ ఝాన్సీ. అలా నటనపై ఇష్టం పెరగడంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టానని తెలిపారు. తన యాంకరింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో రెండే రెండు చానళ్లు నలుగురు యాంకర్లు. మరి ఈరోజు అంటే 33 చానల్లో 44 మంది యాంకర్లుగా మారింది అంటూ సెటైరికల్ గా చెప్పింది. క్యాట్ అండ్ రేస్ అనేది అప్పట్లో ఉంది ఇప్పట్లోను కూడా కొనసాగుతుందని, తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తప్పులు చేశానని ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఈ స్థాయికి వచ్చామని తన ప్రయాణంలో ఎంతోమంది రచయితలు సహకరించారని తెలిపింది. తన కెరీర్లో ఆల్ టైం ఫేవరెట్ ప్రోగ్రాం టాక్ ఆఫ్ ది టౌన్ అని ఆ ప్రోగ్రాం తో ఎంతో పాపులారిటీ వచ్చిందని తెలిపారు. అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు యాంకర్ ఝాన్సీ.

తన కెరీర్ ప్రారంభంలో సిహెచ్ శ్రీనివాస్ అనే రచయిత తనకు ఎంతో సహకరించాలని, తన కెరీర్ డెవలప్మెంట్ కు అతను కూడా ఒక కారణమని ఝాన్సీ తెలిపారు. కొంతమంది రచయితలు తాను షో చేస్తానంటే నచ్చేది కాదని వారి స్క్రిప్టును కాస్త మార్చిన ఇబ్బందిగా ఫీల్ అయ్యే వారిని అలాంటి వారికి ఉన్నది ఉన్నట్లుగా చదివి వెళ్లిపోయే యాంకర్లు ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఝాన్సీ. ఇలాంటి క్రమంలోనే తనకు 'ఫైర్ బ్రాండ్' అంటూ ముద్రవేశారని తెలిపారు. తనకు ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లు చెప్పడం తెలుసునని అన్నారు. కానీ అన్ని విషయాలలో ఫైర్ బ్రాండ్ల ఉండాలని ఏ విషయంలో తగ్గాలో.. విషయంలో.. నెగ్గాలో తనకు తెలుసని అలా వ్యవహరించడం వల్లే నీటికి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నానని తెలిపారు.
తాను ఎన్నో టీవీ కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరించాలని , కొంతమంది తనను కావాలని అలాంటి ప్రోగ్రామ్స్ నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఏ రోజు కూడా వారిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోలేదని ప్రతివారితోను స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని తెలిపారు ఎన్నో ప్రోగ్రామ్స్ ను హెట్టు చేసిన ఘనత తనకు ఉందని కానీ దాని ఉందో 100 డేస్ ఫంక్షన్కు.. 200డేస్ ప్రోగ్రాం కు తాను లేకుండా సెలబ్రేషన్స్ చేశారని తెలిపారు. తనను ఉపయోగించుకుని ఎంతోమంది ఇండస్ట్రీలో మోసం చేశారని తన ఆవేదనను వెళ్ళబుచ్చారు యాంకర్ ఝాన్సీ.


Click it and Unblock the Notifications











