నంది వెనక్కి తీసుకోవాలి

By Staff

Tulasi
తులసి సినిమాలోని ఝాన్సీ పాత్రకు నంది అవార్డు ఇవ్వడంపై మొదలైన వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. తాజాగా ఈ విషయమై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తరతరాలుగా తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న భాషను, యాసను, సంస్కృతిని అవమాన పరుస్తూ సినిమాల్లో అసందర్భ పాత్రలు సృష్టించడం, వాటికి బహుమతులు ఇవ్వడం గౌరవప్రదం కాదని జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

అచ్చమైన తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలోనే సజీవంగా ఉందన్న కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యల్ని ఆమె గుర్తుచేశారు. నంది అవార్డు ప్రకటించిన జ్యూరీ తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఈ తరహా సినిమాలను ప్రోత్సహించవద్దని కోరారు. సినిమాకు ఇచ్చిన అవార్డును వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కవిత నేతృత్వంలో పలువురు కార్యకర్తలు సమాచార, సినిమాటోగ్రఫిశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి వెళ్లిపోవడంతో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. తులసి చిత్రంలో ఝాన్సీ కోకాపేట కనకం పాత్రను పోషించారు. ఆ పాత్రకు గాను 2007 నంది అవార్డులలో హాస్య నటిగా ఎంపిక చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X