twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ ఝాన్సీ నిర్మాతగా ఆంగ్ల చిత్రం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రసిద్ధ బుల్లితెర వ్యాఖ్యాత, నటి ఝాన్సీ నిర్మాతగా మారారు. షీతల్ మోర్జారియా దర్శకత్వంలో ఎ బనాయేంగే ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రేఖ పప్పుతో కలిసి ఆంగ్లంలో 'ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రిథింగ్' చిత్రాన్ని నిర్మించారు. స్త్రీ స్నేహం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు ఛాయా గ్రాహకుడు, కూర్పరి మినహా మిగిలిన టీమ్ అంతా మహిళలే కావడం విశేషం. సాగరి వెంకట, సంపద హర్కారా, అయాంతా మిఛెల్ ముఖ్యతారలుగా నటించారు.

    Jhansi

    ఈ నెలాఖరున గోవాలో జరుగనున్న సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ 'ఇంత వరకూ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ డీల్ చేయలేదు. ఈ సినిమాలో మూడు పాత్రలే ఉంటాయి.

    ముగ్గురు అమ్మాయిలు, వారి స్నేహం, తమ సమస్యల పరిష్కారం నేపథ్యంలో చాలా బోల్డ్ నేచర్‌లో ఈచిత్రం చేసాం. ఆగస్టులో చిత్రీకరణ చేసాం. 62 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రాన్ని అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపిస్తాం. త్వరలో దేశ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శోభన ఎన్. రావు.

    English summary
    TV anchor and character artist Jhansi has silently made an English language film titled 'All I Want Is Everything'. The film's cast and crew members are all women, except for the cinematographer and editor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X